Health Benefits of Olive Oil: వంటల్లో ఏ నూనె వాడితే మంచిదో తెలియక సతమతం అవుతున్నారా, ఆలివ్ నూనెతో లభించే పోషకాలు తెలిస్తే, ఇక డాక్టర్ అవసరం ఉండదు..
నూనెలన్నిటిలో ఆలివ్ ఆయిల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నూనె ప్రతిబొట్టులో ఆరోగ్య గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వంటల్లో రిఫైండ్ ఆయిల్, లేదా గ్రౌండ్ నట్ ఆయిల్ స్థానంలో ఆలివ్ ఆయిల్ వాడమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఆలివ్ ఆయిల్ ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైందని వైద్యులు చెప్తున్నారు. నూనెలన్నిటిలో ఆలివ్ ఆయిల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నూనె ప్రతిబొట్టులో ఆరోగ్య గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరంగా ఉండేందుకు అవసరమైన అన్ని పోషకాలు ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల గుండె జబ్బులు తగ్గడం.. మెరుగైన కంటి చూపు.. యాంటీ ఏజింగ్ స్కిన్ వంటి ప్రయోజనాలున్నాయి. ఆలివ్ నూనెతో ఆరోగ్యానికి బహుళ ప్రయోజనాలు మాత్రమే కాదు.. వంటల రుచిని పెంచడానికి కూడా సరైనదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో 0.3 శాతం అసిడిటి కంటే తక్కువ కోల్డ్ ప్రెస్ ఆలివ్ ఆయిల్ అని అంటున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనె జుట్టు.. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
ఆలివ్ అయిల్‌లో చాలా పోషక పదార్ధాలు ఉన్నాయి. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మానికి నిగారింపు వస్తుంది. ప్రస్తుత తరుణంలో శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని ఆలివ్ ఆయిల్ పెంచుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఆలివ్ ఆయిల్‌ను రోజువారీ వంటల్లో భాగంగా చేసుకుంటే.. క్రమంగా ఊబకాయం కూడా తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్ కారణంగా శరీరంలో అదనంగా ఉండే కొవ్వు కరగడంతో..బరువు కూడా తగ్గుతుంది. ఇక ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యలుగా ఉంటున్న డయాబెటిస్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఆలివ్ ఆయిల్‌కు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని వైద్య నిపుణులు అంటున్నారు. ఆలివ్ ఆయిల్ అనేది కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా..రక్త ప్రసరణను అదుపులో ఉంచుతుంది.