Health Tips: భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా...దానికి కారణాలు చికిత్స తెలుసుకుందాం...

అయితే తలనొప్పి రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది కంప్యూటర్ పైన స్క్రీన్ పైన ఎక్కువ సేపు చూస్తూ ఉంటారు. దీని వల్ల కంటికి ఒత్తిడి అనేది కలుగుతుంది.

Headache (Photo Credits: Pixabay)

చాలామంది తరచుగా ఇబ్బంది పడే సమస్య తలనొప్పి అది ఎందుకు వస్తుందో తెలియదు సడన్ గా వచ్చే చాలా ఇబ్బందిని గురిచేస్తుంది. అయితే తలనొప్పి రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది కంప్యూటర్ పైన స్క్రీన్ పైన ఎక్కువ సేపు చూస్తూ ఉంటారు. దీని వల్ల కంటికి ఒత్తిడి అనేది కలుగుతుంది. దీని ద్వారా కూడా తలనొప్పి అనేది సంభవిస్తుంది కాబట్టి అధికంగా కంప్యూటర్ ఫోన్ చూసేవారు మీరు గ్లాసెస్ పెట్టుకొని గానీ లేదా కాస్త టైం మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ తలనొప్పి నుండి బయటపడవచ్చు.

ఘాటైన వాసనలు..

కొంతమందికి ఘాటైన వాసనలు పెర్ఫ్యూమ్ స్మెల్ వంటివి పడవు వీటి వల్ల కూడా తలనొప్పి అనేది వస్తుంది అటువంటివారు ఈ ఘాటైన వాసనలకు దూరంగా ఉంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

నిద్రలేమి: ఈ మధ్యకాలంలో తరచుగా ఎక్కువగా ఇనపడే సమస్య నిద్రలేమి. నిద్రలేమి వల్ల తలనొప్పి సమస్య అధికమవుతుంది కాబట్టి కనీసం 8 గంటలు నిద్రపోయినట్లయితే ఈ తలనొప్పి సమస్య తగ్గుతుంది.

కెఫిన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు:

చాలామంది కాఫీ టీలు అధికంగా తీసుకుంటారు వీటితో పాటు టిఫిన్ ఎక్కువగా ఉన్న కూల్డ్రింక్స్ ని కూడా తీసుకుంటారు వీటి ద్వారా తలనొప్పి సమస్య ఇంకా అధికమవుతుంది కాబట్టి టిఫిన్ ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

Health Tips: ఈ బెల్లం తింటే గుండెలో బ్లాకులు సైతం కరగడం ఖాయం..

నివారణ చిట్కాలు: తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త మెడిటేషన్ యోగా లాంటివి చేసినట్లయితే తలనొప్పి సమస్య తగ్గుతుంది. తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు కొంచెం వాముని తీసుకొని దోరగా వేయించి ఒక కర్చీఫ్ లో పెట్టుకొని వాసన చూసినట్లయితే తలనొప్పి సమస్య తగ్గుతుంది. ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామం చేసినట్లయితే కూడా తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif