Relation Tips: సెక్స్ తర్వాత నా యోని నుంచి వీర్యం లీక్ అవుతోంది, అంటే నా భర్త వీర్యం పలుచగా ఉందా, నాకు పిల్లలు పుట్టరా ?
వీర్యం స్ఖలించిన అనంతరం నా యోని నుంచి తెల్లటి ద్రవం బయటకు వస్తోంది. అది చూసి నా భర్త వీర్యం అంతా బయటకు వచ్చేస్తోంది అందుకే పిల్లలు వెంటనే కలగడం లేదని నిరాశ చెందుతున్నారు.
ప్రశ్న: నా పేరు జయ ( పేరు మార్చాం ) నా వయసు 23 సంవత్సరాలు. మాకు వివాహం జరిగి ఆరు నెలలు గడుస్తోంది. మేము వెంటనే పిల్లలను కనాలని ప్లాన్ చేస్తున్నాము. అందుకోసం మేము తరచూ శృంగారంలో పాల్గొంటున్నాము. డాక్టర్ సలహా మేరకు పీరియడ్ పూర్తయిన పదవ రోజు నుంచి నా భర్తతో ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటున్నాము. ఇలా గడచిన రెండు నెలలుగా మేము పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాము. అయితే మేము పద్ధతి గా శృంగారంలో చేస్తున్నాము. నా భర్త యోనిలో అంగం దూర్చి వీర్యం స్ఖలించే వరకు స్ట్రోక్స్ ఇస్తున్నాడు. వీర్యం స్ఖలించిన అనంతరం నా యోని నుంచి తెల్లటి ద్రవం బయటకు వస్తోంది. అది చూసి నా భర్త వీర్యం అంతా బయటకు వచ్చేస్తోంది అందుకే పిల్లలు వెంటనే కలగడం లేదని నిరాశ చెందుతున్నారు. కానీ వీర్యం చిక్కగా లేదని పలుచగా ఉందని అనుమానిస్తున్నారు అందుకే నా యోనిలో వీర్యం నిలవడం లేదని ఆయన బాధపడుతున్నారు. అయితే యోని నుంచి వీర్యం కారడం అనేది సహజమే అని నేను కొన్ని పత్రికల్లో చదివాను అయినప్పటికీ నా భర్త ఇంకా తన వీర్యం పలుచగానే ఉందని అనుమానిస్తున్నారు. దీనికి పరిష్కారం చెప్పండి.
Relation Tips: సిజేరియన్ తర్వాత సెక్స్ అంటే విరక్తి కలుగుతోంది,
సమాధానం : యోనిలో వీర్యస్కలనం జరిపిన తర్వాత, కొద్దిగా వీర్యంలోని నుంచి బయటకు రావడం సహజమే ఆ మాత్రాన పిల్లలు కలగరు అనుకోవడం అపోహ మాత్రమే. నిజానికి యోని లోపల వీర్యం స్కలించిన తర్వాత, అందులోని వీర్యకణాలు అండాన్ని చేరుకుంటాయి. ఆ వీర్యకణాల్లోని కేవలం ఒక వీర్యకణం మాత్రమే అండం లోపలికి ప్రవేశిస్తుంది అప్పుడే ఆ అండం ఫలదీకరణం చెంది, ఆ ఫలదీకరణం చెందిన అండం ఓవరీస్ లో చేరి స్థిరపడుతుంది. తద్వారా స్త్రీ గర్భవతి అవుతుంది. నిజానికి యోని నుంచి వీర్యం బయటకు రావడం అనేది. చాలా సహజమైన ప్రక్రియ. ఇది దాదాపు ప్రతి ఒక్కరిలోనూ జరుగుతుంది. ఒక్కో సారి యోనిలో వీర్యం ఎక్కువగా చలించినా కూడా అది బయటకు వస్తుండు అంతమాత్రాన వీర్యం పలుచగా ఉన్నట్టు కాదు. ముందు మీరు అపోహలు వీడి, శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ పిల్లలను అనే ప్రయత్నం చేయండి. అదేవిధంగా స్త్రీ ఆరోగ్యం కూడా పిల్లలు కనేందుకు దోహదపడాలి. అందుకే మీరు కూడా మంచి పోషకాహారం తీసుకుంటే మంచిది. పిల్లలు కనేందుకు అవసరమైన పోలిక్ యాసిడ్ ను కూడా మహిళలు తీసుకుంటే మంచిది.