Health Tips: చుండ్రుతో జుట్టు ఊడిపోతోందా..అయితే ఈ చిట్కా పాటిస్తే చుండ్రు పూర్తిగా మాయం..
ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ సూక్ష్మజీవి తలలో అధికంగా ఉండే నూనే, మృతకణాలని ఆహారంగా తీసుకొని వృద్ధి చెందుతుంది.
చాలామంది తలలో చుండ్రు సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. చలికాలంలో బాధించే సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు,వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని చుండ్రు సమస్య వేధిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఈ చుండ్రు సమస్య ఎందుకు వస్తుంది. ఇది వస్తే దీన్నిఎలా నివారించాలి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..
ముఖ్యంగా చుండ్రు సమస్య రావడానికి గల కారణం మన తలలో ఉండే ఈస్టు అనే హానిలేని సూక్ష్మజీవి. ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ సూక్ష్మజీవి తలలో అధికంగా ఉండే నూనే, మృతకణాలని ఆహారంగా తీసుకొని వృద్ధి చెందుతుంది. దీని మూలంగా చేసుకొని మృతకణాలు ఎక్కువగా అయి తల నిండా పొట్టు లాగా కనబడుతుంది. దీనినే చుండ్రు అంటారు. ఆహారంలో గణనీయమైన మార్పులు, ఎక్కువగా ప్రయాణాలు చేయటం, వాతావరణంలో మార్పు రావటం, నీళ్లు పడకపోవడం వంటివి అన్నీ చుండ్రుకు కారణాలు.
చుండ్రు సమస్య వస్తే ఎలా నివారించాలి:
ఆపిల్ సీడర్ వెనిగర్ తో చుండ్రును నివారించవచ్చు. ఫంగస్ ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం వెనిగర్ ను నీళ్లను సమానంగా కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించుకోవచ్చు.
బేబీ ఆయిల్ ను తలకు బాగా రుద్ది , కొంచెం సేపు మసాజ్ లాగా చేసి ఆ తర్వాత వేడి నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ ని తలకు చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
అలాగే కలబంద గుజ్జును తల మధ్య బాగంలో రుద్ది 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం దానిని పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేయాలి.
వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమానంగా కలిపి వేడి చేయాలి. వేడిచేసిన ఈ నూనెను తలకు బాగా పట్టించి వేళ్లతో సున్నితంగా మర్ధనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ..
చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి బాగా మరగించాలి. చల్లారిన తర్వాత వెంట్రుకలకు నూనె పట్టేలా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గంటకు తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వలన చుండ్రు సమస్యను నివారించవచ్చు.