Covid Deaths Row: కరోనావైరస్ మరణాలపై షాకింగ్ అధ్యయనం, సెకండరీ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ వల్లే ఎక్కువగా మరణాలు, కరోనాతో కాదని తెలిపిన అధ్యయన నిపుణులు

అంచనా వేస్తున్నారు.

China's Shanghai reports first Covid deaths since start of lockdown

COVID Deaths were Caused by Another Infection: భారతదేశంతో సహా అనేక దేశాలు ఇప్పటికీ కరోనా కేసులలో క్రమరహిత పెరుగుదలను చూస్తున్నందున ప్రపంచం కరోనావైరస్ ప్రభావంతో తిరుగుతున్నందున, పరిశోధకులు ఇప్పటికీ SARS-CoV-2 శరీరంపై ఎలా ప్రభావం చూపుతుందో అధ్యయనం చేస్తున్నారు. అంచనా వేస్తున్నారు.

వారికి కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ సమయంలో వెంటిలేటర్ల ద్వారా మద్దతు పొందిన వ్యక్తుల యొక్క ప్రధాన విభాగం వారి మరణాలకు దారితీసే సెకండరీ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుందని ఇప్పుడు ఒక కొత్త విశ్లేషణ సూచిస్తుంది. చాలా మరణాలు కరోనా వైరస్‌ వల్ల కాదని, మరో ఇన్‌ఫెక్షన్‌ దీనికి కారణమని కొత్త అధ్యయనం సూచిస్తున్నది. కరోనా సోకి తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్లపై చికిత్స పొందిన వారిలో ఎక్కువ శాతం, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ వల్ల మరణించినట్లు అమెరికా పరిశోధకులు తెలిపారు.

30 నిమిషాల కంటే ఎక్కువగా ఫోన్ మాట్లాడేవారికి అధిక రక్తపోటు, కొత్త అధ్యయనంలో వెల్లడి

కరోనా బారిన పడిన రోగుల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ (న్యుమోనియా) చాలా సాధారణమని పేర్కొన్నారు. వెంటిలేషన్‌ అవసరమయ్యే దాదాపు సగం మంది రోగులను ఈ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. పూర్తిగా చికిత్స అందించని సెకండరీ బ్యాక్టీరియల్ న్యుమోనియానే కరోనా రోగుల అధిక మరణాలకు ఏకైక కారణమని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన ఫీన్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బృందం తెలిపింది.

తమ ఫలితాల నిర్ధారణకు మెషిన్ లెర్నింగ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను పరిశోధకులు వినియోగించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించిన సుమారు 585 మంది రోగుల ఊపిరితిత్తుల నమూనాలను ఏఐ ద్వారా విశ్లేషించారు. వీరిలో 190 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందిన ఈ రోగులు తీవ్ర న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యం వల్ల చనిపోయినట్లు గుర్తించారు.

భారత్‌లో ప్రాణాంతకంగా మారిన డెంగ్యూ, అర్జంటుగా వ్యాక్సిన్ కావాలంటున్న శాస్త్రవేత్తలు, షాకిస్తున్న సైంటిస్టుల కొత్త అధ్యయనం

మరోవైపు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ (న్యుమోనియా)ను నిర్ధారించేందుకు కార్పెడైమ్ (CarpeDiem) అనే కొత్త మెషిన్ లెర్నింగ్ విధానాన్ని పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. ఒకే విధమైన లక్షణాలతో ఐసీయూలో చికిత్స పొందిన రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ డేటాను ఈ ఏఐ ద్వారా గ్రూపింగ్‌ చేసి విశ్లేషించారు. వెంటిలేటర్ అనుబంధ న్యుమోనియా (వీఏపీ) కోసం అందించే చికిత్స ఫలించకపోవడమే తీవ్రమైన న్యుమోనియా ఉన్న రోగుల మరణాలకు కారణమన్నది తమ అధ్యయనంలో గుర్తించినట్లు రచయిత బెంజమిన్ సింగర్ తెలిపారు. కేవలం కరోనా వైరస్‌ వల్ల సంభవించిన మరణాల రేటు చాలా తక్కువని తమ డేటా ద్వారా తెలిసిందన్నారు.

కరోనా మరణాలు వైద్యులు పేర్కొన్నట్లుగా ‘సైటోకిన్ స్ట్రోమ్’ (ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెయిన్‌పై ప్రభావం) వల్ల కాదన్నారు. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారు సెకండరీ న్యుమోనియాకు చికిత్స పొంది ఉంటే వారు జీవించే అవకాశాలు ఎక్కువని విశ్లేషించారు. ఈ పరిశోధన అంశాలను జర్నల్ ఆఫ్ క్లీనికల్ ఇన్వెస్టిగేషన్‌లో ప్రచురించారు. సెకండరీ న్యుమోనియా సంఘటనల ఫలితాలను నిర్ధారించడానికి మరియు నిర్ధారించడానికి పరిశోధకులు ఊపిరితిత్తుల నమూనాల యొక్క స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ విశ్లేషణను ఉపయోగించారు.