Covid 19 Vaccine For Teenagers: మీ పిల్లలకు కరోనా టీకా వేయిస్తున్నారా, అయితే ఇది తప్పకుండా మీకోసం, వ్యాక్సిన్ వేయించే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే..

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొద్దిగా జర్వం, బాడీ పెయిన్స్, వంటివి వచ్చే చాన్స్ ఉంది.

Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీని నుంచి బయటపడేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ వైరస్ రూపాంతంరం చెందుకుంటూ వివిధ వేరియంట్ల రూపంలో ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. ఫస్ట్ వేవ్, సేకండ్ వేవ్‌లో దేశంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచింది. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన వారికి టీకాను రెండు డోసులుగా వేయగా తాజాగా 15 నుంచి 18 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించింది.

నిన్నటి నుంచి టీకాలు ఇవ్వడం సైతం మొదలుపెట్టారు. వీరికి వ్యాక్సిన్ పూర్తయ్యే సమయానికి 12 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేసే చాన్స్ ఉంది. దీనిపైనా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 2007 నుంచి తర్వాత జన్మించిన వారికి మాత్రమే టీకాలు వేస్తోంది.ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి అందరికీ కొవాక్సిన్ టీకా వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీరికే కాకుండా 12-18 ఏళ్ల వారికి సైతం దీనిని అత్యవసరంగా యూజ్ చేయొచ్చు.కానీ భారత్‌లో ఈ వయస్సు పిల్లల వారికి టీకా ఇచ్చేందుకు ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు.

నైరుతి చైనాలోని ప్రభుత్వ కార్యాలయంలో పేలుడు, 20 మంది లోపల చిక్కుకుపోయారని అధికారులు వెల్లడి

15 నుంచి 18 సంవత్సరాల లోపు వారు లోపు ఆధారకార్డు వివరాలతో కోవిన్ యాప్‌ లో రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొద్దిగా జర్వం, బాడీ పెయిన్స్, వంటివి వచ్చే చాన్స్ ఉంది. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. కేవలం పారసెటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా సందేహాలు కలిగితే వ్యాక్సిన్ తీసుకునే సమయంలో అక్కడి డాక్టర్ ను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోండి. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా నిబంధనలు తప్పక పాటించాలి.