Monkeypox: గే, బైసెక్సువల్ సెక్స్ చేసే వారి ద్వారా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి, పురుషుడితో మరో పురుషుడు సెక్స్ చేసేవారిలో మంకీపాక్స్ లక్షణాలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా సీడీసీ
కేసులు (Monkeypox) తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ దాని వ్యాపి ఆందోళకనకరంగా మారింది. ఈ విజృంభణలో చాలావరకు కేసులు.. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి (gay, bisexual men against the virus) చెందినట్లు స్పష్టమవుతోంది
ఇప్పటిదాకా ఆఫ్రికాలో మాత్రమే కనిపించిన మంకీపాక్స్ వైరస్ తాజాగా యూరప్, యూకే, నార్త్ అమెరికాలోనూ విజృంభిస్తోంది. కేసులు (Monkeypox) తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ దాని వ్యాపి ఆందోళకనకరంగా మారింది. ఈ విజృంభణలో చాలావరకు కేసులు.. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి (gay, bisexual men against the virus) చెందినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు వైద్య సంస్థలు ఒక స్పష్టమైన ప్రకటన చేశాయి. ఈ కేసుల్లో (Monkeypox outbreak) చాలావరకు సెక్సువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వ్యాప్తి చెందినవని నిపుణులు (United Kingdom health experts) చెబుతున్నారు. ఉత్తర అమెరికాతో పాటు యూరప్‌లోనూ డజన్ల కొద్దీ కేసులు సెక్సువల్ కార్యకలాపాల ద్వారానే వెలుగు చూశాయి. ఫ్లూ(జ్వరం) తరహా లక్షణాలు ఉండే మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
కెనడాలో డజను, స్పెయిన్.. పోర్చుగల్‌లో 40(అనుమానిత.. ధృవీకరణ కేసులు), బ్రిటన్‌లో తొమ్మిది(మే 6వ తేదీ నుంచి ఇప్పటిదాకా..), అమెరికాలో బుధవారం తొలి మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి చెందినట్లు వైరస్ బారిపడ్డ వాళ్లను పరీక్షిస్తే స్పష్టమయ్యింది. ఈ మేరకు అమెరికా సీడీసీ ప్రకటన చేసింది. మరోవైపు యూకే ఆరోగ్య భద్రత సంస్థ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేసింది.
గే, బైసెక్సువల్, పరస్పర పురుష శృంగారంలో పాల్గొన్న వ్యక్తుల్లోనే మంకీపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు వెల్లడించింది. యూకేలో వెలుగు చూసిన మొదటి కేసు నైజీరియాతోనే ముడిపడి ఉండడం విశేషం. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గత వారం రోజులుగా యూకే, యూరోపియన్ ఆరోగ్య ప్రతినిధులతో సమన్వయం అవుతూ.. పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో చాలావరకు గే, బైసెక్సువల్‌గా గుర్తించినట్లు తెలిపింది. పురుషుల పరస్పర శృంగారంతోనే వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయ్యిందని డబ్ల్యూహెచ్‌వో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోసే ఫాల్ వెల్లడించారు.
మంకీపాక్స్ బారినపడ్డ వాళ్లు కోలుకోవడానికి పదిహేను రోజుల దాకా పట్టొచ్చు. ప్రాణాల మీదకు వచ్చేది చాలా తక్కువ సందర్భాల్లోనే. పది మందిలో ఒకరికి మాత్రమే ప్రాణాల మీదకు వస్తుంది. మంకీపాక్స్.. జ్వరం తరహా లక్షణాలతో మొదలవుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. మంకీపాక్స్ వైరస్‌ను మనీపాక్స్ వైరస్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లూ ‘ఆర్థోపాక్స్ వైరస్’ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఉచ్ఛ్వాస పెద్ద బిందువుల(తుంపర్ల) ద్వారా, శరీరంపై గాయాలు, కలుషితమైన పదార్థాలతో.. చాలాసందర్భాల్లో వ్యాపిస్తుంది. జంతువులు, మనుషులు, వైరస్ సోకిన వస్తువుల ద్వారానూ మంకీపాక్స్ వ్యాప్తి చెందుతుంది. జంతువుల ద్వారా కాటు, కొరికిన గాయాలు, కరవడం.. ఇలా వ్యాప్తి చెందుతుంది. అయితే యూరప్, నార్త్ అమెరికాతో పాటు యూకేలో వెలుగు చూస్తున్న కేసుల్లో.. వైరస్ బారినపడ్డ వాళ్లు ఇతరులతో అత్యంత సన్నిహితంగా(శారీరక సంబంధం) మెలగడం వల్లే వైరస్ విజృంభించడం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉంటే ఆఫ్రికా ఖండంలో బయటపడ్డ వేల కేసుల్లో.. చాలావరకు అపరిశుభ్రత, జంతువుల ద్వారానే వైరస్ వ్యాపించింది. శారీరక కలయిక ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువే.
స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్‌నే చాలాకాలంగా మంకీపాక్స్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. కానీ, అది అథెంటిక్‌గా ప్రూవ్ కాలేదు. సాధారణ జ్వరానికి ఉపయోగించే చికిత్సతో పాటు యాంటీ వైరల్స్, వ్యాక్సినియా ఇమ్యూన్ గ్లూబ్లిన్‌ను కూడా మంకీపాక్స్ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడ్డవాళ్లు.. ఇతరులకు దూరంగా ఉంటూ, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.