Monkeypox: అమెరికా సహా యూరప్ లో మంకీపాక్స్ కలకలం, అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మంకీపాక్స్ సోకిందా? లేదా? ఎలా తెలుసుకోవాలంటే!
A CDC image shows a rash on a monkeypox patient (Image Credit: Reuters)

New York, May 19:  మంకీపాక్స్ (Monkey pox) అరుదైన, ప్రమాదకరమైన వైరస్ (Virus). ఇటీవల ఐరోపాలోని పలు దేశాల్లో ఈ మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. యూకే సహా పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ వైరస్ బయటపడింది. అమెరికాలో(America) గతేడాదికూడా ఈ కేసులు వెలుగు చూశాయి. నైజీరియాలో (Nigeria) పర్యటించి వచ్చిన ఇద్దరు వ్యక్తలు గతంలో ఈ వ్యాధి బారిన పడ్డారు. తాజాగా మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో ఈ వైరస్ కలకలం సృష్టిస్తోంది. మసాచుసైట్స్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మంకీపాక్స్ (Monkey pox) అనేది అరుదైన, తేలికపాటి వైరస్. సాధారణంగా ఆఫ్రికాలోని (Africa) కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి సోకిన అడవి జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది తొలిసారి 1958లో పరిశోధనల్లో భాగంగా కోతుల నుంచి ఈ వ్యాధిని కనుగొన్నారు. అందుకే పేరు మంకీపాక్స్ (Monkey pox) అని పెట్టారు. యూకేలోని ఎన్ హెచ్ఎస్ వెబ్‌సైట్ ప్రకారం 1970లో మొదటిసారిగా మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. మంకీపాక్స్ సోకిన జంతువు కరిస్తే కానీ, రక్తం, శరీర ద్రవాలు, జంతువుల యొక్క జుట్టును తాకడం ద్వారా ఈ వ్యాధి మనుషులకు సోకవచ్చు. ఇది ఎలుకలు, ఉడుతలు వంటి వాటి ద్వారా కూడా మనుషులకు వ్యాపిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికితోడు వ్యాధి సోకిన జంతువు నుండి మాంసాన్ని సరిగా ఉడికించకుండా తినడం ద్వారా కూడా ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశాలు ఉన్నాయి.

Monkeypox in US: అమెరికాలో తొలి మంకీపాక్స్ కేసు, వ్యాధి సోకిన వ్య‌క్తి శ‌రీరాన్ని తాకితే ఈ వైరస్ వచ్చేస్తుంది, మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు ఇవే, సెక్స్ వ‌ర్క‌ర్ల ద్వారా ఎక్కువగా వ్యాప్తి  

మనిషికి మంకీపాక్స్ వ్యాధి సోకితే అది ఇతరులకు సోకడం చాలా తేలిక. ఎందుకంటే ఇది వ్యక్తుల మధ్య సులభంగా వ్యాప్తి చెందుతుంది. దద్దుర్లు ఉన్నవారు ఉపయోగించే దుస్తులు, పరుపు, తువ్వాలను తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. మంకీపాక్స్ చర్మపు పొక్కులు తాకడం ద్వారా, దగ్గు, తుమ్ములు సమయంలో ఎవరైనా దగ్గర ఉంటే వారికి మంకీపాక్స్ సోకే అవకాశాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. మంకీపాక్స్ వ్యాధి సోకిన వారు చనిపోయే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం.. వ్యాధి సోకిన వారిలో పది మందిలో ఒకరు ఈ మంకీపాక్స్ వల్ల చనిపోయే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ మంకీపాక్స్ (Monkey pox) సోకినా జాగ్రత్తలు తీసుకుంటే వారం రోజుల్లో కోలుకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Vladimir Putin: పుతిన్ ఆరోగ్యపరిస్థితి వెరీ సీరియస్, బ్లడ్ క్యాన్సర్ సహా పలు వ్యాధులతో బాధపడుతున్న రష్యా అధ్యక్షుడు, ఆయన ఆరోగ్యం గురించి సంచలనం రేపుతున్న ఆడియో టేప్ 

మంకీపాక్స్ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. స్మాల్ పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడుతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలామంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదిలాఉంటే మంకీపాక్స్ లైంగికంగా సంక్రమించే వైరస్ అని నిపుణులు విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ అది ఎంతవరకు వ్యాపిస్తుంది, సాధ్యమయ్యే ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడానికి అధ్యయనాలు జరుగుతున్నాయి.