Red Meat - Type 2 Diabetes Risk: మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడినట్లే, హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు
మేక, గొర్రె, బీఫ్...(Red Meat) ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం (Red Meat - Type 2 Diabetes Risk) గణనీయంగా పెరుగుతుందని తాజాగా హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది
మాంసాహార ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. మేక, గొర్రె, బీఫ్...(Red Meat) ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం (Red Meat - Type 2 Diabetes Risk) గణనీయంగా పెరుగుతుందని తాజాగా హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. రోజూ 28 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ (నిల్వ చేసిన మాంసం) తినేవారిలో టైప్ 2 మధుమేహం ముప్పు 15 శాతం పెరుగుతోందని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ స్టడీ తేల్చింది.
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలలో దాదాపుగా 20 లక్షల మంది పెద్ద వయసు వారిపై నిర్వహించిన 31 పైగా అధ్యయనాలను, వాటి ఫలితాలను నిశితంగా విశ్లేషించగా ఈ వివరాలు బయటపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. రోజువారీ ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని దాదాపు పదేళ్లకు సంబంధించిన డాటాను ఈ అధ్యయనంలో విశ్లేషించినట్లు తెలిపారు. ఇందులో పొగతాగడం సహా ఇతరత్రా అలవాట్లు, బీఎంఐ, శారీరక శ్రమ, వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశంలో మంకీపాక్స్ నిర్ధారణ కోసం తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్, మరో ఘనతను సాధించిన ఏపీ విశాఖ మెడ్‌టెక్ జోన్
రోజూ 50 గ్రాముల రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ (Red and processed meat) తీసుకునేవారికి మధుమేహం ముప్పు 15 శాతం ఎక్కువని, రోజూ 100 గ్రాముల రెడ్ మీట్ తీసుకుంటే ముప్పు 10 శాతం, రోజూ 100 గ్రాముల చికెన్ తీసుకునే వారికి 8 శాతం ఎక్కువని లాన్సెట్ స్టడీలో తేలింది. రెడ్ మీట్, ఇతర జంతువుల మాంసంలో ఎక్కువగా ఉండే హేమ్ ఐరన్ వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని హార్వర్డ్ టి.హెచ్.ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో వెల్లడైంది.మాంసాహారం వండే క్రమంలో విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాలు, హై లెవల్ శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇది టైప్ 2 మధుమేహానికి దారితీస్తుందని వివరించారు.