Side effects of sleeping late night: అర్థరాత్రి వరకూ మెలకువ ఉంటున్నారా, అయితే సెక్స్ విషయంలో డకౌట్ అవ్వడం ఖాయం..

సెక్సువల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ పోవడం, సెక్స్ కోరికలు తగ్గడం జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా నిద్రలేమి వచ్చేసి టైమ్ కి నిద్రపోయినా నిద్ర పట్టదని అంటున్నారు. ఇది మరింత ప్రమాదం.

The Surprising Risks of Sleeping Too Much ( Photo-File Image)

Night Sleep: ఉదయం అంతా అలసిపోయే శరీరం రిలాక్స్ అయ్యేది రాత్రిపూటే. అంటే.. నిద్ర కోరుకునే శరీరం తన అలసటను తీర్చుకుంటుంది. కానీ.. మనం శరీరానికి ఆ అవకాశం ఇవ్వకపోతే అనేక సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందని అంటున్నారు సైంటిస్టులు. అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉంటే అనారోగ్యమే కాదు.. సెక్సువల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ పోవడం, సెక్స్ కోరికలు తగ్గడం జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా నిద్రలేమి వచ్చేసి టైమ్ కి నిద్రపోయినా నిద్ర పట్టదని అంటున్నారు. ఇది మరింత ప్రమాదం.

నిద్రతోనే శరీరం అలసట నుంచి ఉపశమనం పొందుతుంది. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో తీరిక లేని పనులు, ఒత్తిడులు చాలా కామన్. కానీ.. నిద్రకు సమయం కేటాయించాల్సిందే. అర్ధరాత్రిళ్లు పడుకుని తెల్లారి 5కే లేచి మళ్లీ ఉరుకుల పరుగుల జీవితంతో పోటీ పడుతూ పోరాడుతున్నాం. ఇటువంటి సమయాల్లోనే నిద్రలేమి, రక్తపోటు, అధిక బరువు, ఒత్తిడి, డిప్రెషన్, మధుమేహం, గుండెపోటు, ఇతర హృద్రోగాలు వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు.

పురుషులు, మహిళల్లో టెస్టోస్టిరాన్ పై ప్రభావం చూపుతుందంటున్నారు. మహిళలకు టెస్టోస్టిరాన్ ఎముకలు బలంగా ఉండేందుకు, కండరాలు బలంగా మారేందుకు, కొత్తగా ఎర్ర రక్త కణాలు పుట్టడానికి ఉపయోగపడుతుంది. నిద్రలేమి దీనిపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని వివరించారు. నిద్రకు సమయం ఖచ్చితంగా 7 నుంచి 9 గంటలు కేటాయించాల్సిందేనని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అంటోంది.

ఇవన్నీ ఒకెత్తైతే నిద్రలేమితో సెక్స్ లైఫ్ ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి, పనులు, ఆర్ధిక ఇబ్బందులతో సమస్యలు.. వీటన్నింటి గురించి ఆలోచించి నిద్ర సరిగా పట్టదు. కానీ.. అదే సెక్స్ కోరికలపై ప్రభావం చూపుతుందంటున్నారు. నిద్రలేమి పురుషుల్లో అంగస్తంభన, ఎరౌజల్ సమస్యలు తీసుకొస్తుందంటున్నారు. మహిళల్లో అయితే స్కలన సమస్యలు వస్తాయని అంటున్నారు. నేటి యువత యాంత్రిక జీవనంతో ఈ సమస్యల బారిన ఎక్కువగా పడుతున్నారని అంటున్నారు.

వీకెండ్ కదాని ఎక్కువగా మేల్కొనడం తగదంటున్నారు. ఆల్కాహాల్‌ మానేయాలి. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత కెఫిన్ పదార్థాలు తీసుకోకూడదు. రాత్రి నిద్రకు రెండు గంటల ముందు వేడి నీళ్లతో స్నానం చేయాలి. నిద్రపోయే ముందు గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇందులో తేనె కలుపుకొని తాగినా ఫలితం ఉంటుందంటున్నారు.

Tags