Condoms: అంగం స్థంభించిన తర్వాతే కండోమ్ తొడగండి, లేకుంటే అది యోనీలోకి జారిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్న నిపుణులు, వారు ఇంకేం చెబుతున్నారంటే..
ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, 40 శాతం కండోమ్‌లు (Facts About Condoms) మహిళలకు అమ్ముడవుతున్నాయి.ఇక పురాతన కండోమ్‌లు పంది ప్రేగులతో తయారు చేయబడ్డాయి!
కండోమ్ గురించి తెలియని వాస్తవాలు: 15000 సంవత్సరాల క్రితం నుండి ఉపయోగించబడుతున్న కండోమ్‌లు ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రియమైన గర్భనిరోధక పద్ధతిగా మారాయి. ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, 40 శాతం కండోమ్‌లు (Facts About Condoms) మహిళలకు అమ్ముడవుతున్నాయి.
ఇక పురాతన కండోమ్‌లు పంది ప్రేగులతో తయారు చేయబడ్డాయి! ఇది మాత్రమే కాదు, మీకు ఇష్టమైన కండోమ్‌ల (Strange Condom Facts) గురించి మీరు తెలుసుకోవలసిన చాలా తెలియని వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి, కండోమ్‌ల గురించి మీకు తెలియని కొన్ని వాస్తవాలను ఇక్కడ మేము మీకు అందిస్తున్నాము, ఇవి మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తాయి మరియు కండోమ్‌ల (UNKNOWN FACTS ABOUT CONDOM) గురించి మీ జ్ఞానాన్ని పెంచుతాయి.
సెక్స్‌లో పాల్గొన్న తర్వాత దాన్ని వెంటనే బయట పడేయాలి. రెండోసారి దాన్ని వాడకూడదు.ఇక కండోమ్‌ను అంగం స్తంభించిన తర్వాతే తొడగాలి. లేకపోతే.. అది అంగానికి సరిగ్గా పట్టదు. అంగం స్థంభించకుండా కండోమ్ తొడిగితే వదులుగా మారి ఒక్కోసారి స్త్రీల జననాంగంలోకి జారుకుంటుంది. వాడిన కండోమ్‌ను మళ్లీ వాడితే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే దానిపై ఉండే జిగురు వంటి లూబ్రికెంట్ సైతం పూర్తిగా తొలగిపోయి.. తీవ్రమైన రాపిడి ఏర్పడి ఇరువురికి గాయాలు కావచ్చు.
ఇక కండోమ్ ప్యాక్‌ను విప్పిన తర్వాత దానికి రంథ్రాలు ఏమైనా ఉన్నాయా లేదా అని ముందుగా చెక్ చేసుకోవాలి.మీకు ఏమైనా రంథ్రాలు కనిపిస్తే వెంటనే దాన్ని పారేయండి, ముఖ్యంగా జిగురుగా ఉండే కండోమ్‌లనే వాడాలి. పొడిగా ఉండే కండోమ్‌లు వాడొద్దు. అలాగే కండోమ్‌ను అంగానికి తొడిగే సమయంలో మొదట కొనను పట్టుకోని అంగానికి తొడగాలి. ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా అంగం మొత్తం కప్పేలా వెనక్కి లాగాలి.ఇక పనైన తర్వాత మాత్రం తప్పకుండా అంగాన్ని శుభ్రం చేసుకోవాలి. స్త్రీలు సైతం యోనిని శుభ్రం చేసుకోవాలి.
చాలామంది కండోమ్ లేకుండా సెక్స్ చేస్తారు. చివరలో వీర్య స్ఖలనం అయ్యే సమయంలొ కండోమ్ తొడుగుతుంటారు. అయితే కండోమ్ లేకుండా సెక్స్ చేస్తున్న సమయంలోనే కొంత వీర్యం యోనిలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా స్కలనం సమయంలో కండోమ్ తొడిగినా ఫలితం ఉండదు. సెక్స్ ప్రారంభంలోనే కండోమ్ తొడగి చివరి వరకు అంటే వీర్యం వచ్చే వరకు కండోమ్ లోనే స్కలించాలి. ఆ తర్వాత అంగానికి ఉన్న కండోమ్ యోనిలోకి జారకుండా జాగ్రత్తగా బయటకు తీయాలి. వెంటనే తీయకపోతే అంగం చిన్నదై కండోమ్ జారిపోతుంది.