Standing while Eating may Cause Cancer: నిలబడి తింటున్నారా? నిల్చొనే నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు క్యాన్సర్ రావొచ్చు.. లక్నోపరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి
నిల్చొని తినటం, తాగడం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
Newdelhi, Jan 20: నిల్చొని తింటున్నారా? (Eating while standing) నిల్చొనే నీళ్లు తాగుతున్నారా? అయితే మీరు క్యాన్సర్ (Cancer) బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు లక్నో శాస్త్రవేత్తలు. నిల్చొని తినటం, తాగడం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. లక్నోలోని కల్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్‌స్టి ట్యూట్ కు చెందిన రేడియోథెరపీ విభాగ అధిపతి రాకేశ్ కపూర్ ఆధ్వర్యంలోని బృందం నిల్చొని తినటం, తాగడం వల్ల కలిగే అనర్థాలపై పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనల్లో నిల్చొని తిన్నప్పుడు అన్నవాహిక సంబంధిత వ్యాధులు వస్తాయని తేలింది. నిల్చొని నీళ్లు తాగినా ఈ సమస్య వస్తుందని గుర్తించారు.
కారణం ఇదే
నిల్చొని తిన్నా, నీళ్లు తాగినా అన్నవాహిక కండరాల పనితీరుకు అడ్డు తగిలి జీర్ణక్రియ పనితీరుపై ప్రభావం పడుతుందని పరిశోధకులు వివరించారు. ఈ పరిస్థితి రానురానూ అన్నవాహిక క్యాన్సర్ కు దారితీస్తుందని వెల్లడించారు.