Exact Time for Pregnancy: రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోండి.. గర్భం దాల్చాలనుకునే వారికి ఇదే సరైన సమయం

నిద్రపోయే సమయం, నిద్రించే వ్యవధి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా? చైనాలోని హునన్‌ లో ఉన్న సెకండ్‌ జియాంగ్యా హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం అవుననే సమాధానం చెప్తుంది.

Representation Purpose Only (File Image)

Newdelhi, July 28: నిద్రపోయే సమయం (Sleeping Time), నిద్రించే వ్యవధి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా? చైనాలోని (China) హునన్‌ లో ఉన్న సెకండ్‌ జియాంగ్యా హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం అవుననే సమాధానం చెప్తుంది. గర్భం దాల్చాలనుకొనే మహిళలు రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోవాలని పరిశోధకులు సూచించారు. ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం వల్ల అంతర్గత జీవ గడియారానికి విఘాతం కలిగి హార్మోనల్‌ చైన్‌ రియాక్షన్‌ వస్తుందని తెలిపారు. ఫలితంగా అండం, శుక్ర కణాల ఫలదీకరణ అవకాశాలు తగ్గి సంతాన లేమికి దారి తీస్తుందన్నారు. గర్భం దాల్చాలనుకునే మహిళలు రాత్రి 10.45 గంటలలోగా నిద్రపోవాలని తెలిపారు.

ఏపీ ప్రభుత్వ పథకాల పేరు మార్పు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాలుగా మార్పు, మరిన్ని పథకాలకు కూడా

పరిశోధన ఇలా..

2015-2020 మధ్య దాదాపు 4,000 మంది మహిళల దినచర్యను విశ్లేషించినప్పుడు.. రాత్రి 10.45 గంటల తర్వాత నిద్రపోయేవారిలో 22 శాతం మందికి సంతానోత్పత్తి సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. రాత్రి 10.45 గంటల తర్వాత నిద్రపోయే మహిళలు గర్భం దాల్చే అవకాశాలు ఐదో వంతుకుపైగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు,సౌదిలో చిక్కుకున్న మరో వ్యక్తిని స్వగ్రామానికి తీసుకొచ్చిన లోకేష్‌, గ్రామస్తుల హర్షం