Union Budget 2024: క్యాన్సర్ రోగులకు బడ్జెట్‌లో ఊరట, మూడు రకాల మందులపై సుంకాన్ని ఎత్తివేసిన మోదీ సర్కారు
క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేంద్ర ప్రభుత్వం సుంకం ఎత్తివేసింది.
New Delhi, July 23: జూలై 23న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్‌లో (Union Budget) ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేంద్ర ప్రభుత్వం సుంకం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. మూడు క్యాన్సర్ చికిత్స మందులకు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న ఉద్యోగులకు అలర్ట్, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000 కుపెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటన
దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి" దశలవారీ తయారీ కార్యక్రమంలో భాగంగా వైద్య ఎక్స్-రే యంత్రాలలో ఉపయోగించే ఎక్స్-రే ట్యూబ్‌లు మరియు ఫ్లాట్ ప్యానెల్ డిటెక్టర్‌లపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD)కి సంబంధించిన మార్పులను కూడా ఆరోగ్య మంత్రి వివరించారు.
అదేవిధంగా మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 6 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీంతో సెల్‌ఫోన్లు, పుత్తడి, వెండి ధరలు తగ్గనున్నాయి. దీంతోపాటు ప్లాటినమ్‌పై 6.4 శాతాననికి కుదించారు.
ఇక నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు తీసుకురానున్నామని చెప్పారు. సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో సరళీకరణలు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానాన్ని సరళీకరిస్తున్నామని చెప్పారు. వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్నారు.