IPL Auction 2025 Live

Sunstroke Symptoms: మనకు వడదెబ్బ తగిలిందని తెలుసుకోవడం ఎలా, ఒకవేళ వడదెబ్బ తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సమాచారం

సాధారణంగా మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఏకంగా ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి.

Image Used For Representational Purposes (Photo Credits: JBER)

ఈ ఏడాది ఎండాకాలంలో ఊహించినదానికంటే ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణంగా మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఏకంగా ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే వేడి నుంచి ఉపశమనం కోసం జనాలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొంతమంది ఏసీల ముందు కూర్చుని అక్కడే పరిమితం అవుతున్నారు. మరి కొంతమంది ఫ్యాన్ గాలికి కాస్త ఉపశమనం పొందుతున్నారు.

మరికొంతమంది ఇక తరచూ ఫ్రిజ్ లో చల్లటి నీళ్లు తాగుతూ గడిపేస్తున్నారు ఏదైనా పని పడి బయటికి వెళ్లాలి అంటేనే భయపడిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఇక ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరికి వడదెబ్బ తగిలి ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే అందరూ జాగ్రత్తలు (Warning Signs and Symptoms of Sunstroke) తీసుకుంటున్నారు కాని పొరపాటున వడదెబ్బ తగిలితే గుర్తించడం ఎలా (Sunstroke Symptoms) అని మాత్రం కన్ఫ్యూషన్ లో ఉండి పోతున్నారు. కళ్ళు తిరగడం, కాళ్ళ వాపులు రావడం, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, తీవ్ర జ్వరం, అధిక చెమట పట్టడం, తల తిరిగి పోవడం లాంటివి వడదెబ్బ లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు.

కోడి గుడ్లు ఎండాకాలం తింటే శరీరంలో వేడి పెరుగుతుందా, సైంటిస్టులు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా...?

గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు సమస్యలు ఉన్నవారు సూర్యతాపం వల్ల శరీరం మొత్తం డీహైడ్రేషన్ కు గురి అవుతుందని ఇక వడదెబ్బ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.