Watermelon: పుచ్చకాయలు అదే పనిగా తింటే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే, వైద్య నిపుణులు ఏమంటున్నారో ఓ సారి వినండి

దాహార్తిని తీర్చుకోవడానికి చాలామంది ఈ పుచ్చకాయలు (Watermelon) అదే పనిగా తింటుంటారు. ఐతే పుచ్చకాయలను మోతాదుకి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

Watermelon (Photo Credits: Pixabay)

ఛాలామంది వేసవి రాగానే పుచ్చకాయలు తెగ తినేస్తుంటారు. దాహార్తిని తీర్చుకోవడానికి చాలామంది ఈ పుచ్చకాయలు (Watermelon) అదే పనిగా తింటుంటారు. ఐతే పుచ్చకాయలను మోతాదుకి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కువగా తినడం వల్ల (Eat too much watermelon) శరీరంలో నీటి స్థాయి పెరుగుతుంది.

అలా చేరిపోయిన అదనపు నీరు విసర్జించబడకపోతే, అది రక్తం పరిమాణంలో పెరుగుదలకు దారితీస్తుంది. ఫలితంగా కాళ్ళలో వాపు, అలసట, మూత్రపిండాలు బలహీనం కావడం... తదితర సమస్యలకు. అంతేకాదు శరీరంలో సోడియం స్థాయిలను కోల్పోవడానికి కూడా ఇది దారితీయవచ్చు.100 గ్రాముల పుచ్చకాయలో దాదాపు 30 కేలరీలు ఉంటాయి. ఇందులో నీరు ఎక్కువగా ఉండటంతో, 500 గ్రాములు.. అంటే అరకేజీ వరకూ తీసుకోవచ్చు. అంటే దీని ద్వారా 150 కేలరీలు శరీరంలోకి వచ్చేస్తాయి.

పచ్చి కొబ్బరిలో ఎన్నో ప్రయోజనాలు, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధకారి, కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చడంలో కీలక పాత్ర దీనిదే..

అలాగే, ఇందులో 100 గ్రాములకు ఆరు గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి పుచ్చకాయలో అర్థకేజీకి 30 గ్రాముల చక్కెర ఉంటుంది. పుచ్చకాయ తినడం చెడ్డది కాదు కానీ అధికంగా తినడం అనారోగ్యకరమైనది. అందువల్ల తగిన మోతాదులో మాత్రమే ఏ పండైనా తినాలని వైద్య నిపుణులు చెపుతున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif