మన ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే ఆహారాల్లో కొబ్బరిని ఒకటిగా (Raw Coconut Benefits) చెప్పుకోవచ్చు. కొబ్బరిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందించటంలో కొబ్బరిని మించింది లేదంటే అతిశయోక్తి లేదు. మంచి రుచిని కలిగి ఉండే కొబ్బరిని (Here are Reasons to Eat Raw Coconut) చిన్నారుల నుండి పెద్దల వరకు అంతా ఎంతో ఇష్టపడతారు. కొబ్బరిలో విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము పుష్కలంగా లభిస్తాయి.
కొబ్బరిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా (Coconut benefits to man) మారుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను తగ్గించి డయాబెటిస్ ను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదపడతాయి. మూర్ఛ, అల్జీమర్స్ వంటి మెదడు రుగ్మతల నుండి కొబ్బరి కాపాడుతుంది.
శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయటంలో దోహదపడటంతోపాటు, వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయకారిగా పనిచేస్తుంది. రాత్రి నిద్ర పోవడానికి అర గంట లేదా పావు గంట ముందు ఒక స్పూన్ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం యవ్వనంగా కాంతి వంతంగా మారుతుంది. నిద్ర బాగా పడుతుంది. వృద్ధాప్య చాయలు దరిచేరవు.
కొబ్బరికాయ పగలగొడితే అందులో పువ్వు వస్తే మంచిదేనా, అలా రావడం దేనికి సంకేతం ?
నీరసం, అలసట వంటి సమస్యలు కొబ్బరి తినటం ద్వారా తొలగించుకోవచ్చు. కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి. ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే వారు ఆహారంలో కొబ్బరిని బాగం చేసుకోవటం మంచిది. శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరిచి ఇతర రోగాలతో పోరాడే శక్తిని అందిస్తుంది. క్రిములు, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, వైరస్ ల కారణంగా ఏర్పడే వ్యాధులను నయం చేయడానికి కొబ్బరి ఉపకరిస్తుంది. పచ్చికొబ్బరితో చట్నీగా, లౌజుగా, కూరల్లో వాడుకోవచ్చు.