Sabarimala’s Aravana Prasadam: తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం.. శబరిమల అయ్యప్ప ప్రసాదంలో కల్తీ.. మోతాదుకు మించి క్రిమి సంహారకాలు

శబరిమల అయ్యప్ప ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

Sabarimala Temple (Photo Credits: IANS)

Newdelhi, Oct 7: శ్రీవారి తిరుమల లడ్డూలో (Tirumala Laddu) కల్తీ జరిగిందన్న వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల అయ్యప్ప ప్రసాదం అరవణలో (Sabarimala’s Aravana Prasadam) కల్తీ జరిగిందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రసాదంలో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. దీంతో ఈ అరవణ ప్రసాదాన్ని ఆలయ అధికారులు ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం గత ఏడాదిగా వాడకుండా అలాగే ఉన్నట్టు సమాచారం.

వీడియో ఇదిగో, నెల రోజులుగా సర్వీసింగ్ చేయడం లేదని ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టిన కస్టమర్లు, కర్ణాటకలో ఘటన

అసలేమైంది?

అరవణ ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమిసంహారకాలు కలిసినట్టు నిరుడు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ప్రసాదాన్ని వాడకుండా అలాగే నిలిపివేశారు.

వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలో శాంసంగ్, మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మంది సిబ్బందిని తీసేస్తున్నట్లుగా వార్తలు

ఎలా బయటపడింది?

అయితే, ఆ కల్తీ ప్రసాదాన్ని పారబోస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని గ్రహించిన టీడీబీ దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్‌ ను ఇండియన్‌ సెంట్రిఫ్యుజ్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌ పొందిందని, వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని టీడీబీ చైర్మన్‌ ప్రశాంత్‌ తెలిపారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.