Makaravilakku 2025 Date And Makara Jyothi Timings: అయ్యప్ప స్వాములకు అత్యంత పవిత్రమైన మకర జ్యోతి దర్శనం సంక్రాంతి పర్వదినం సందర్భంగా దర్శనం ఇవ్వడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మండలం రోజులు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం ద్వారా తమ జీవితం ధన్యమైందని భావిస్తారు. అయ్యప్ప స్వామి ఈ మకర జ్యోతిలోనే జ్యోతి స్వరూపుడిగా కనిపిస్తాడని భక్తుల నమ్మకం మకర జ్యోతిని మకర విలక్కు అంటారు. అంటే సంక్రాంతి రోజున దేవస్థానం ఈ మకర విలకు ఉత్సవాన్ని జరుగుతుంది అయ్యప్ప స్వామి ఇతిహాసంలో స్వామివారిని మణికంఠుడు అని అంటారు. అయ్యప్పస్వామి శబరిమలైలో 18 మెట్లు ఎక్కిన తర్వాత జ్యోతి రూపంలో అంతర్ధానమయ్యారని ఏటా మకర సంక్రాంతి రోజున జ్యోతి స్వరూపంలో తిరిగి వస్తాడని భక్తుల విశ్వాసం అందుకే మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు.
అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే మకర విలకు మకర జ్యోతి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. కొండపైన జ్యోతి స్వరూపంలో కనిపించే అయ్యప్పను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల భక్తులు టీవీ స్క్రీన్ లలో కూడా లైవ్ ద్వారా చూస్తారు. మకరజ్యోతి దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం.
మండల దినాలు దీక్షతో అయ్యప్ప స్వామి మాల వేసుకుని అకౌంటిత భక్తితో దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు ఈ మకర జ్యోతి దర్శనం చేసుకోవడం వల్ల తమ దీక్షకు సాఫల్యం లభించిందని భావిస్తుంటారు. ప్రతి స్వామి కూడా ఒకసారైనా మకరజ్యోతి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. ఇలా చేసుకోవడం వల్ల తమకు సకల శుభాలు జరుగుతాయని వారు భావిస్తుంటారు. అయ్యప్ప స్వాములకు మకరజ్యోతి దర్శనం అంటే ఎంతో పవిత్రమైనది ఈ మకర జ్యోతి దర్శనం ఈ సంవత్సరం ఎప్పుడు ఎన్ని గంటలకు జరుగుతుంది. ముహూర్త విశేషాలు ఏంటి ఈ దర్శనం ఆన్లైన్ లైవ్ ద్వారా ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు వాటి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జనవరి 14, 2025 సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య మకరవిళక్కు జ్యోతి మూడుసార్లు కనిపిస్తుంది. అదే రోజు, భక్తులు మకర జ్యోతి నక్షత్రాన్ని కూడా ఎంతో భక్తితో పూజిస్తారు.