TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు, ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన టీటీడీ, www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని వెల్లడి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు (TTD Darshan Tickets) రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) వర్గాలు తెలిపాయి.

TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు, ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన టీటీడీ, www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని వెల్లడి
Tirumala Tirupati Devasthanams | Photo: Twitter

Tirumala, July 26: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు (TTD Darshan Tickets) రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) వర్గాలు తెలిపాయి. కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. శ్రీవారి దర్శనం టికెట్లు, సేవా టికెట్ల పేరుతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్‌ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెలా 20వ తేదీ ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది దళారులు, ట్రావెల్స్‌ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్‌ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్‌ సంస్థ (Tirupati Darshan Ticket Agent) భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు, భర్త గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్‌ 498ఏ కింద విచారించడానికి వీల్లేదని స్పష్టం, భర్త సంబంధీకుల్లోకి గర్ల్‌ఫ్రెండ్‌ రాదని వెల్లడి

దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే తమ ఆధార్‌ కార్డు నంబర్, చిరునామాతో టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని కోరింది.

 



సంబంధిత వార్తలు

‘The Raja Saab’: ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్త‌యిన రాజాసాబ్ షూటింగ్..టీజ‌ర్ పై టీం ఏమందంటే?

Folk Singer Shruthi Dies by Suicide: వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు సింగ‌ర్ మృతి, పెళ్లైన 20 రోజుల‌కే అత్త‌వారింట్లో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌

Mumbai Ferry Boat Tragedy: నేవీ బోటును ఢీకొనడంతోనే ముంబై పడవ ప్రమాదం, 13 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం ఫడ్నవిస్, మృతుల కుటుంబాలకు రూ. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

TTD News: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif