TTD Arjitha Seva Tickets: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే 3 నెలల సేవా ఆర్జిత టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ

మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టికెట్లను రేపు సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

Tirumala (File Image)

Tirumala, Feb 21: వచ్చే మూడు నెలల కాలానికి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను (TTD Arjitha Seva Tickets) టీటీడీ రేపు విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టికెట్లను రేపు సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లక్కీ డిప్ నిర్వహించనున్నారు. ఈ లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు... నిర్దేశిత రుసుం చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని టీటీడీ (TTD) సూచించింది. కాగా, టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి.

తిరుమలలో పటిష్ఠ నిఘా, చిన్నపాటి మైక్రో డ్రోన్‌లు కూడా పనిచేయకుండా నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌, బెల్‌తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపిన ఈవో ధర్మారెడ్డి

తిరుమలలో (Tirumala) అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీని తీసుకురానుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

 కేవలం 20 రూపాయలకే రైల్వే స్టేషన్‌లో గదులు అద్దెకు లభిస్తాయని మీకు తెలుసా, రైల్వేలో మీకు తెలియని ఈ సదుపాయం గురించి ఓ సారి తెలుసుకోండి

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్టుమెంట్‌లో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 61,374 మంది దర్శించుకోగా 19,691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కాను