Andhra Pradesh: తిరుపతి విమానాశ్రయంలో వీఐపీ లాంజ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, విమానాశ్రయ అథారిటీకి చెందిన భూకేటాయింపుకు కేంద్ర కేబినేట్ ఆమోదం

ఈ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏడాది పొడవునా లక్షల మంది భక్తులతో పాటు, ఎంతో మంది వీవీఐపీలు, వీఐపీలు ఇక్కడికి వస్తారు. ఈ నేపథ్యంలో ......

Tirupati International Airport | Photo: Wikimedia Commons

New Delhi, November 27: తిరుపతి (Tirupati) విమానాశ్రయంలో వీఐపి లాంజ్ (VIP Lounge) నిర్మాణం కోసం విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కు చెందిన 1800 చదరపు మీటర్ల భూమిని కేటాయించడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( APEWIDC) కి 15 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి రూ. 1/- లైసెన్స్ ఫీజుతో అందజేయనున్నారు.

భారతదేశంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏడాది పొడవునా లక్షల మంది భక్తులతో పాటు, ఎంతో మంది వీవీఐపీలు, వీఐపీలు ఇక్కడికి వస్తారు. ఈ నేపథ్యంలో సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర కేబినేట్ వీఐపి లాంజ్ నిర్మాణం కోసం భూకేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాంజ్ నిర్వహణ బాధ్యతలు కూడా కేంద్రం, APEWIDC శాఖకు అప్పగించింది.

ఇదిలా ఉండగా, శ్రీవారి వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు తెరిచి ఉంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.  ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా కేవలం ఏకాదశి, ద్వాదాశి రోజులలో మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఇకపై వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో పది రోజులూ గేట్లు తెరిచి ఉంచాలని టిటిడి అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం, ఈ ఏడాది చివరిలోపు నుంచే ఈ విధానం అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif