Heavy Crowd at Yadadri Temple: యాదాద్రి క్షేత్రానికి ఒక్కరోజులో రూ.1 కోటికిపైగా ఆదాయం... చరిత్రలో ఇదే ప్రథమం.. యాదాద్రీషుడి దర్శనానికి నిన్న ఒక్కరోజే లక్షమందికి పైగా కొండకు.. ఆదివారం, కార్తీకమాసం కావడంతో పోటెత్తిన భక్తులు..

నిన్న ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, యాదాద్రికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. నేడు ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం వచ్చింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం చరిత్రలో ఇదే ప్రథమం.

File: Yadadri (Credits: Telangana Tourisim Dept.)

Yadadri, Nov 14: తెలంగాణలో (Telangana) అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి (Yadadri). నిన్న ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు (Devotees) తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, యాదాద్రికి రికార్డు స్థాయిలో ఆదాయం (Income) లభించింది. నేడు ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం వచ్చింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి (Temple) ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం చరిత్రలో ఇదే ప్రథమం.

ఎన్ని ప్రయత్నాలు చేసిన వివాహం జరగడం లేదా, అయితే నవంబర్ 22న మాస శివరాత్రి రోజు ఈ పూజ చేస్తే, కళ్యాణం జరగడం ఖాయం..

కార్తీక మాసం, ఆదివారం నేపథ్యంలోనే యాదాద్రికి లక్ష మందికి పైగా భక్తులు పోటెత్తారని అధికారులు పేర్కొన్నారు. యాదిగిరిగుట్టలో గతంలో ఉన్న ఆలయాన్ని టీఆర్ఎస్ సర్కారు భారీ ఎత్తున అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆలయ పునర్ నిర్మాణాన్ని అద్భుతమనదగ్గ రీతిలో చేపట్టింది. అందుకోసం సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సాయాన్ని కూడా తీసుకుంది.