Vjy, Jan 15: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ తలసరి ఆదాయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. నాడు సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తీసుకున్న నిర్ణయాలు, నూతన విధానాలే ఈరోజు తెలంగాణ అభివృద్ధికి దోహదపడ్డాయని చంద్రబాబు చెప్పారు. తాను రూపొందించిన విజన్ 2020 ప్రణాళిక ద్వారా సమైక్యాంధ్రలో సమాచార సాంకేతిక రంగానికి భూమిక వేయగలిగానని పేర్కొన్నారు.
ఈ ప్రణాళికకు మద్దతుగా అప్పట్లో బహుళజాతి కంపెనీలను ఆహ్వానించడం, ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయడం వంటి చర్యలే ఈరోజు తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాయని అభిప్రాయపడ్డారు.ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ విశ్వవ్యాప్తంగా ఉజ్వలమైన భవిష్యత్తు సాధించడానికి, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ప్రగతి సాధించడానికి కారణం తన పాలనేనని చంద్రబాబు గర్వంగా ప్రకటించారు. ఆ రోజుల్లో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చినందువల్లే ఈరోజు తెలుగు ప్రజలు Entrepreneurs గా ఎదగగలిగారని ఆయన తెలిపారు.
నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది
నా విజన్ వల్లే తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే టాప్ గా నిలిచింది : సీఎం చంద్రబాబు
నాడు సమైక్యాంధ్రలో విజన్ 2020 తీసుకొచ్చాను
ఇప్పుడు ప్రతి పల్లె, ప్రతి ఇల్లు సంతోషంగా ఉండడం కోసం స్వర్ణాంధ్ర విజన్ - 2047 తయారు చేశాను
ఆరోజు నేను టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టే ఈరోజు… pic.twitter.com/tEsI0JKwBy
— Swathi Reddy (@Swathireddytdp) January 14, 2025
ఇప్పుడు తన దృష్టి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంపై ఉందని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి పల్లె, ప్రతి ఇంటి అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర విజన్ – 2047 ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇది ఒక సమగ్ర ప్రణాళికగా, అన్ని రంగాలలో రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు తెరలేపాయి.