SC On Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో ఉన్నా నేరమే, మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం

ఆ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని Supreme Court స్పష్టత నిచ్చింది.

supreme court (Photo/ANI)

చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో వున్నా నేరమేనని సర్వోన్నత న్యాయస్థానం (SC On Child Pornography) స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని Supreme Court స్పష్టత నిచ్చింది. న్యాయస్థానాలు.. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదమే వాడకూడదని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈమేరకు మద్రాసు హైకోర్టు తీర్పును (Madras High Court) సోమవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్ లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కింది కోర్టు అతనికి శిక్ష ఖరారు చేయడంతో ఆ యువకుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.

సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వివాదం పంచాయితీ, సీబీఐతో విచారణ జరిపించాలంటూ పిటిషన్, హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న వైసీపీ

కేసు విచారణ తర్వాత మద్రాసు హైకోర్టు తీర్పు చెబుతూ.. వీడియోలు డౌన్ లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు వాటిని ఎవరికీ షేర్ చేయలేదని, ఎవరినీ వేధించలేదని పేర్కొంటూ సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలు నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు గత జనవరిలో తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్లను సోమవారం విచారించింది. మద్రాసు హైకోర్టు తీర్పును ఈ బెంచ్ తప్పుబడుతూ.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రకంగా ఉన్నప్పటికీ అది పోక్సో చట్టం కింద నేరార్హమేనని తీర్పు చెప్పింది.



సంబంధిత వార్తలు

Sukhbir Singh Badal Attacked: వీడియో ఇదిగో, స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు, అనుచరులు అలర్ట్ కావడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డ సుఖ్ బీర్ సింగ్ బాదల్

Earthquake In Hyderabad: వీడియోలు ఇవిగో..హైదరాబాద్‌,ఖమ్మం, వరంగల్‌లో భూకంపం, భూ ప్రకంపనల ధాటికి కూలిన ఇల్లు గోడ, రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు

Buying Cheap Powerbanks? చవకైన పవర్‌బ్యాంక్‌లను కొనుగోలు చేసేవారికి అలర్ట్, రెండు కంపెనీలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..

Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif