207 KG Roti: ఇదేందయ్యా ఇది.. ఇంత పెద్ద చపాతీనా?? ప్రపంచంలోనే అతిపెద్ద రోటీ ఇది. తయారీకి 2 గంటలు.. కాల్చేందుకు మరో ఐదు గంటల సమయం.. ఇంతకీ ఎవరు, ఎక్కడ తయారుచేశారంటే??
అయితే, ఈ రొట్టె తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది.
Newdelhi, Oct 9: ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని (Biggest Roti) రాజస్థాన్ (Rajasthan) లోని భిల్వారాలో తయారు చేశారు. అయితే, ఈ రొట్టె తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. చేసిన రోటీని కాల్చేందుకు ఐదు గంటల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని తయారు చేసేందుకు గత రెండేళ్లుగా సన్నాహాలు చేస్తున్నారు. 207 కిలోల భారీ రొట్టెను (207 KG Roti) భిల్వారా పట్టణం హరిసేవా ధామ్‌లో తయారు చేశారు. మహామండలేశ్వర్ సంత్ హన్‌స్రామ్ ఆధ్వర్యంలో తయారు చేశారు. ఉదయం రోటీ తయారీ పనులు మొదలు కాగా.. సాయంత్రానికి పూర్తయ్యింది. మొదట 22 మంది వ్యక్తులు కలిసి పిండిని కలిపారు. ఆ తర్వాత రోటీని తయారు చేశారు. రొట్టెను పెనంపై వేసి తిప్పకుండా ఒకేవైపు కాల్చారు. ఈ రొట్టె తయారీ కోసం 120 కేజీల గోధుమ పిండి, 10 కేజీల మైదా, 10 కేజీల నెయ్యి, 67 లీటర్ల నీళ్లను వినియోగించారు.
రొట్టెను ఏం చేస్తారు?
రెండు గంటలకుపైగా శ్రమించి భారీ కర్ర సహాయంతో రొట్టెను చేశారు. ఆ తర్వాత వేద మంత్రోచ్ఛరణల మధ్య రోటీని కాల్చారు. అంతకు ముందు భారీ రోటీని కాల్చేందుకు వెయ్యి ఇటుకలతో పొయ్యిని సిద్ధం చేశారు. 800 కిలోల బొగ్గుతో పాటు పలు వస్తువులను సైతం వినియోగించారు. సుమారు రోటీని కాల్చేందుకు 5 గంటల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ రోటీని రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ మిఠాయి తయారీదారులు తయారు చేసి.. అనంతరం హరిసేవా ధామ్‌కు వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.
Monocrotophos Banned: మోనోక్రొటోఫాస్ పై కేంద్రం నిషేధం.. మరో మూడు రకాల పురుగు మందులూ బ్యాన్