Colon Poked Out: గట్టిగా తుమ్మాడు.. అంతే పెట్టున పేగులు బయటకొచ్చాయ్‌.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన.. అసలేం జరిగిందంటే??

63 ఏండ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇటీవల ఓ రెస్టారెంట్‌ కు వెళ్లాడు. కావాల్సిన పదార్థాలను ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో

Colon Poked Out (Credits: X)

Newyork, June 10: అది అమెరికాలోని (America) ఫ్లోరిడా రాష్ట్రం. 63 ఏండ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇటీవల ఓ రెస్టారెంట్‌ కు వెళ్లాడు. కావాల్సిన పదార్థాలను ఆర్డర్ (Order) ఇచ్చాడు. ఇంతలో ఆ పెద్దాయనకు హఠాత్తుగా పెద్ద పెట్టున తుమ్ము వచ్చింది. ఇక ఏం చేస్తాడు. తుమ్మాడు. అయితే, కొద్ది సేపటికి అతని పొత్తి కడుపు భాగమంతా రక్తంతో తడిసిపోయింది. ఆ వెంటనే నొప్పి మొదలైంది. నొప్పి భరించలేక అతను విలవిల్లాడాడు. పెనిమిటీకి ఏమైందని భార్య పరిశీలించి చూడగా..అతడి పొట్ట భాగం నుంచి పేగులు బయటకు పొడుచుకుని రావటం కనిపించింది. ఆందోళనకు గురైన ఆమె వెంటనే అంబులెన్స్‌ కు ఫోన్‌ చేసి.. తన భర్తను దవాఖానకు తరలించింది.

ముచ్చట‌గా మూడోసారి ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన న‌రేంద్ర మోదీ, కేబినెట్ లోని మంత్రులు వీళ్లే (వీడియో ఇదుగోండి)

ఎందుకు ఇలా??

పెద్దాయన కేసును చూసి వైద్యులు సైతం షాక్‌ తిన్నారు. అయితే, గతంలో అతడికి ఉదరభాగంలో సర్జరీ జరిగిందని, పెద్ద పెట్టున వచ్చిన తుమ్ము కారణంగానే పేగులు బయటకు వచ్చి వుండవచ్చునని వైద్యులు అంచనావేశారు.

జ‌మ్మూక‌శ్మీర్ లో యాత్రికుల బ‌స్సుపై ఉగ్ర‌దాడి, విచ‌క్షణా ర‌హితంగా కాల్పులు జ‌ర‌ప‌డంతో 10 మందికి పైగా మృతి