Teachers Falter on Basic Mathematics: భారత్, పశ్చిమాసియాలోని 80% మ్యాథ్స్ టీచర్లకు అసలు బేసిక్స్ కూడా తెలియవట.. తాజా అధ్యయనంలో వెల్లడి
దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉన్నదో తెలిపే మరో ఉదాహరణ ఇది. భారత్ సహా పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్ టీచర్లకు అసలు బేసిక్స్ కూడా తెలియవని ఓ ఎడ్ టెక్ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
Newdelhi, June 29: దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ (Educational System in India) ఎలా ఉన్నదో తెలిపే మరో ఉదాహరణ ఇది. భారత్ (India) సహా పశ్చిమాసియా దేశాల్లోని (Western Countries) దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్ టీచర్లకు అసలు బేసిక్స్ కూడా తెలియవని ఓ ఎడ్ టెక్ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఇండియా, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియాలో 152 స్కూళ్లకు చెందిన 3, 4, 5, 6 తరగతులకు చెందిన 1,300 మందికిపైగా టీచర్లను రెండేండ్లపాటు అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. 75 శాతం మంది ఉపాధ్యాయులు 50 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో ఇబ్బంది డ్డట్టు వివరించింది.
ఈ విషయాలు నిల్
రేషియో, ప్రపోర్షనల్ రీజనింగ్, ఆల్జీబ్రా రీజనింగ్, లాజికల్ రీజనింగ్ వంటి వాటి గురించి మన మ్యాథ్స్ టీచర్లకు తెలియవని అధ్యయనం తేల్చేసింది.
రైతులకు రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు! కీలకవ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి