Snake Bite On Genitals: పురుషాంగాన్ని కాటేసిన నాగుపాము, నొప్పితో విలవిలలాడిపోయిన బాధితుడు, దక్షిణాఫ్రికాలో షాకింగ్ ఘటన వెలుగులోకి

అయితే అతను టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అతని ప్రైవేట్ పార్ట్‌లో విషపూరితమైన కింగ్ కోబ్రా పాము కాటు (Snake Bite On Genitals) వేసింది.

Cobra Snake (Photo Credits: Wikimedia Commons)

దక్షిణాఫ్రికాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి సెలవుల్లో విహారయాత్రను ఆస్వాదించడానికి అక్కడికి వెళ్లగా అతనికి వినోదానికి బదులు భయంకరమైన అనుభవం ఎదురయింది. యూరాలజీ కేస్ రిపోర్ట్స్‌లోని కథనం ప్రకారం, 47 ఏళ్ల వ్యక్తి విహారయాత్ర కోసం దక్షిణాఫ్రికాకు వచ్చాడు. అయితే అతను టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అతని ప్రైవేట్ పార్ట్‌లో విషపూరితమైన కింగ్ కోబ్రా పాము కాటు (Snake Bite On Genitals) వేసింది.

పాము టాయిలెట్ బౌల్‌లో దాక్కుని కూర్చున్నదని, అతను మరుగుదొడ్డిని ఉపయోగిస్తున్నప్పుడు, పాము వ్యక్తి జననాంగాలను కాటు (Man Holidaying in South Africa Gets Bitten by Cobra Snake) వేసిందని ఆ కథనంలో తెలిపారు. వెంటనే పాము కాటుకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.ఈ కథనం ప్రకారం.. బాధితుడు తన జననాంగాలలో పాము కాటేసిన తర్వాత తీవ్రమైన నొప్పితో వాంతులు అయ్యాయి. పాము కాటు తర్వాత, ఆ విషం నడుము ద్వారా అతని ఛాతీ మరియు పొత్తికడుపు వరకు విస్తరించింది. ఆ వ్యక్తిని హెలికాప్టర్‌లో 350 కి.మీ దూరంలో ఉన్న ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లేందుకు దాదాపు 3 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.

బట్టతల ఉన్నా..విగ్గుతో 20 మంది అమ్మాయిల్ని పడేశాడు, వారితో సహజీవనం చేసి డబ్బు, నగలుతో జంప్, ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విగ్గు రాజు కార్తీక్‌ వర్మ అలియాస్ షేక్‌ మహ్మద్‌ రఫీ

ఆస్పత్రికి చేరుకోగానే పురుషుడి పురుషాంగం, స్క్రోటమ్ వాచిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో పురుషాంగం ముదురు ఊదా రంగులోకి మారింది. మెడికల్ జర్నల్ ప్రకారం, డాక్టర్ ఆ వ్యక్తికి హీమోడయాలసిస్ (hemodialysis) వైద్య ప్రక్రియను నిర్వహించాల్సి వచ్చింది. పాము కాటు కేసులు సాధారణంగా తీవ్రంగా ఉంటాయి, అయితే జననేంద్రియ కాటుకు సంబంధించిన కొన్ని కేసులు మాత్రమే నివేదించబడ్డాయి.

ప్రియుడి కోసం వెళ్లిన ప్రియురాలు, తలుపులేసి ఆమెపై కామవాంఛ తీర్చుకున్న మామ, నిందితుడిని అరెస్ట్ చేసిన చిక్కమగళూరు పోలీసులు

విశేషమేమిటంటే, చికిత్సకు పాము విషం యొక్క యాంటీసెరమ్, బ్రాండ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అవసరం. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్సలు అవసరమవుతాయి. అయినప్పటికీ, పాముల ఆవాసానికి ప్రసిద్ధి చెందిన ప్రపంచంలోని అనేక దేశాలలో.. టాయిలెట్‌లో కూర్చునే ముందు టాయిలెట్‌ను ఫ్లష్ చేయాలని ఎల్లప్పుడూ సలహా ఇస్తారు, తద్వారా అలాంటి సంఘటనలు నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.