Man Buried Alive: ఇదెక్కడి ఘోరం..? భూవివాదం నేపథ్యంలో వ్యక్తిని సజీవంగా పాతిపెట్టిన దుండగులు.. వీధి కుక్కలు తవ్వడంతో బతికి బయటపడ్డ బాధితుడు.. ఆగ్రాలో ఘటన
భూవివాదంలో గొడవ ముదరడంతో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని కొట్టి, గొంతు నులిమి, సజీవంగా పూడ్చిపెట్టారు. అయితే, అనూహ్యంగా పాతిపెట్టిన ప్రాంతాన్ని వీధికుక్కలు తవ్వడంతో అతను బయటపడ్డాడు.
Agra, Aug 2: యూపీలోని (UP) ఆగ్రాలో (Agra) ఘోరం జరిగింది. భూవివాదంలో గొడవ ముదరడంతో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని కొట్టి, గొంతు నులిమి, సజీవంగా పూడ్చిపెట్టారు. అయితే, అనూహ్యంగా పాతిపెట్టిన ప్రాంతాన్ని వీధికుక్కలు తవ్వడంతో అతను బయటపడ్డాడు. జూలై 18న ఆగ్రాలోని అర్టోని ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితులను అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాష్ గా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వీరిని గాలిస్తున్నారు. బాధితుడిని రూప్ కిషోర్ గా పేర్కొన్నారు. కిషోర్ తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు తన కుమారుడిని ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి దారుణంగా దాడి చేసి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. అనంతరం తమ పొలంలోనే కాలువలో కిషోర్ ను పూడ్చిపెట్టారని ఆమె వెల్లడించారు.
గొంతు నులిమి, చనిపోయాడని భావించి..
నిందితులు తనని గొంతు నులిమి, చనిపోయాడని భావించి తమ పొలంలో పాతిపెట్టారని, అయితే, తనను పాతిపెట్టిన ప్రాంతాన్ని వీధికుక్కలు తవ్వి, బయటపడ్డ తన శరీరాన్ని కొరకడం ప్రారంభించడంతో తాను స్పృహలోకి వచ్చానని కిషోర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత అతి కష్టంమీద గ్రామానికి తాను వెళ్లగా.. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారని చెప్పాడు. ప్రస్తుతం కిషోర్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు.
భార్య వైఎస్ భారతితో కలిసి పాస్ పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్