Bengaluru Traffic: బెంగళూరులో తారాస్థాయికి చేరిన ట్రాఫిక్‌ కష్టాలు.. వంట కూడా చేసుకోవచ్చంటున్న నెటిజన్లు

2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్‌ సమస్యకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Traffic (Photo Credit- PTI)

Bengaluru, Sep 24: కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bengaluru) ట్రాఫిక్‌ కష్టాలు (Traffic Problems) తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్‌ సమస్యకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్‌ లో చిక్కుకున్న ఓ మహిళ కూరగాయలను ఒలుచుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ట్రాఫిక్‌ లో వంట కూడా చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Bellapu Sohan Singh: రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన సోహన్‌సింగ్ కన్నుమూత.. గుండెనొప్పితో కన్నుమూసిన సోహాన్‌సింగ్

 షాపింగ్‌కు వెళ్లేంత సమయం..

బెంగళూరు ట్రాఫిక్‌ లో చిక్కుకొన్న దీపాంశుకు ఆయనేదో షాపింగ్‌కు వెళ్లినట్టు ‘మీ షాపింగ్‌ అనుభవం ఎలా ఉంది?’ అంటూ గూగుల్‌ నుంచి నోటిఫికేషన్‌ వచ్చింది. ఆయన గంటల తరబడి ఓ షాపింగ్‌ మాల్‌ పక్కన ట్రాఫిక్‌ లో చిక్కుకుపోవడమే అందుకు కారణం.

Boy Saves Many Lives: రైలు పట్టాల కింద గొయ్యి.. గమనించిన పదేళ్ల బాలుడు.. తన ఎర్ర టీషర్టును తొలగించి గాల్లో ఊపుతూ లోకోపైలట్‌ ను అప్రమత్తం చేసిన వైనం.. రైలును వెంటనే ఆపేయడంతో తప్పిన పెను ప్రమాదం.. పశ్చిమ బెంగాల్ లో ఘటన