Telugu States CM’s Meeting Today: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేడే.. ప్రజాభవన్ వేదికగా సమావేశంకానున్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ప్రజలు.. ఏయే అంశాలపై చర్చ ఉండొచ్చంటే?

హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు.

Andhra Pradesh CM Chandrababu write a letter to Telangana CM Revanth Reddy

Hyderabad, July 6: తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి (TG CM Revanth Reddy), చంద్రబాబుల (AP CM Chandrababu) భేటీ నేడు జరుగనున్నది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. శనివారం  సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రజాభవన్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  ఈ భేటీలో గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించనున్నారు. పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై ముఖాముఖీగా చర్చిద్దామని తెలంగాణ సీఎం రేవంత్ కు చంద్రబాబు ఇటీవల లేఖ రూపంలో ప్రతిపాదన పంపారు. చంద్రబాబు ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన రేవంత్.. భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు భేటీ కాబోతున్నారు.

తమిళనాడులో దారుణం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపిన ప్రత్యర్థులు

వేటిపై చర్చ ఉండొచ్చు?

విభజన చట్టం షెడ్యూల్ 9లోని 23 సంస్థలు, షెడ్యూల్ 10లోని 30 సంస్థల విభజన, విద్యుత్తు బకాయిలు, ఐదు గ్రామాల విలీన ప్రక్రియ తదితర అంశాలపై  రేవంత్, చంద్రబాబు డిస్కస్ ప్రధానంగా దృష్టిసారించనున్నట్టు సమాచారం.

వీడియో ఇదిగో, డిపో ఎదురుగా లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అద్దాల నుంచి ముందుకు దూసుకొచ్చి కంటైనర్ కిందపడి డ్రైవర్ మృతి