Heartbreaking video: తల్లి శవాన్ని చూసి తల్లడిల్లుతున్న బుజ్జి వానరం, కన్నీరు పెట్టిస్తున్న వైరల్ వీడియో

చ‌ల‌నం లేకుండా రోడ్డుపై ప‌డిఉన్న త‌ల్లిని లేపేందుకు బుల్లి వాన‌రం ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండాపోయింది.

Baby monkey's painful reaction to mother's death (Image from Viral video)

New Delhi, FEB 24: ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన వీడియో(Viral Video) నెటిజ‌న్లను కంటత‌డి పెట్టిస్తోంది. చ‌నిపోయిన త‌ల్లిని (mother's death) చుట్టుకుని బుల్లి వాన‌రం ఏడుస్తున్న వీడియో అంద‌రి హృద‌యాల‌ను మెలిపెడుతోంది. అస‌లు త‌న తల్లికి ఏమైందో కూడా తెలియ‌ని చిన్న వానరం (Baby monkey) క‌న్నీరుమున్నీర‌వుతోంది. చ‌ల‌నం లేకుండా రోడ్డుపై ప‌డిఉన్న త‌ల్లిని లేపేందుకు బుల్లి వాన‌రం ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండాపోయింది. కోతుల చుట్టూ ప‌లువురు మూగ‌డం ఈ వీడియోలో కనిపిస్తుంది. అసోంలోని రోడ్డుపై వేగంగా వెళుతున్న వాహ‌నం ఢీకొన‌డంతో త‌ల్లి వాన‌రం మ‌ర‌ణించింది.

 

ఈ దృశ్యం ఎప్ప‌టినుంచో వెంటాడుతోంది..అసోంలోని రోడ్డుపై వానరం విగ‌త‌జీవిగా ప‌డిఉంది..అయినా దాని ఒడిలో బుల్లి వానరం ఉంది. అస‌లు తల్లి అలా ఎందుకు ప‌డిఉందో తెలియ‌క బుల్లి వాన‌రం త‌ల్ల‌డిల్లుతోంది..బుల్లి వాన‌రాన్ని సంర‌క్షించేందుకు అన్ని చ‌ర్య‌లూ చేప‌డ‌తామ‌ని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇది చాలా విషాద‌క‌ర ఘ‌ట‌న అని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా, హృద‌యాన్ని క‌లిచివేసే ఉదంత‌మ‌ని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు. ఇత‌రుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఎవ‌రైనా డ్రైవింగ్ చేయాల‌ని మ‌రొక‌రు సూచించారు.



సంబంధిత వార్తలు