Bengal Women Creates History: మహిళల దేశవాళీ క్రికెట్ లో బెంగాల్ టీమ్ నయా చరిత్ర.. హర్యానాపై ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగాల్
వన్డే ఫార్మాట్ క్రికెట్ లో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా బెంగాల్ మహిళా క్రికెట్ టీమ్ అవతరించింది.
Newdelhi, Dec 24: మహిళల దేశవాళీ క్రికెట్ లో (Cricket) సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. వన్డే క్రికెట్ ఫార్మాట్ లో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ప్రపంచంలోనే తొలి జట్టుగా బెంగాల్ మహిళా క్రికెట్ టీమ్ (Bengal Women Cricket Team) అవతరించింది. ‘సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024’లో భాగంగా రాజ్ కోట్ లో సోమవారం హర్యానాతో జరిగిన మ్యాచ్ లో బెంగాల్ టీమ్ ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన తనుశ్రీ 83 బంతుల్లోనే 113 పరుగులు నమోదు చేసింది. ఈ గెలుపుతో ‘సీనియర్ ఉమెన్స్ ట్రోఫీ 2024’లో బెంగాల్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది.
వరల్డ్ రికార్డ్
దేశీయంగా చూస్తే అంతకుముందు 2021లో చండీగఢ్ పై రైల్వేస్ జట్టు ఛేదించిన 356/4 టార్గెట్ రికార్డ్ గా ఉండేది. ఇంటర్నేషనల్ రికార్డు విషయానికి వస్తే.. 2019లో న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కాంటర్‌బరీ జట్టుపై నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ టీమ్ 309 పరుగులను దాటేసింది.
గుండెపోటుతో గ్రౌండ్‌లోనే క్రికెటర్ మృతి, ఛాతి నొప్పి వస్తుందని చెప్పాడు...అంతలోనే..వీడియో ఇదిగో