Bengaluru: బాలిక కడుపులో నుంచి క్రికెట్ బాల్ సైజు హెయిర్ బాల్‌ను తొలగించిన బెంగుళూరు వైద్యులు, బాలిక ట్రైకోఫాగియా వ్యాధితో జుట్టు తినే అలవాటు చేసుకుందని తెలిపిన డాక్టర్లు
బాధిత బాలిక ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎనిమిది సంవత్సరాల బాలిక కడుపులో క్రికెట్ బాల్ సైజులో ఉన్న హెయిర్ బాల్‌ను వైద్యులు (Bengaluru Doctors) ఆపరేషన్ చేసి తొలగించారు. బాధిత బాలిక ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు బెంగుళూరు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ వ్యాధి ఉన్న వారికి జుట్టు తినే అలవాటు ఉంటుందని.. దాన్ని రాంపుజెల్ సిండ్రోమ్‌గా పిలుస్తారని వైద్యులు పేర్కొన్నారు.
బాధితురాలైన బాలిక గత రెండేళ్లుగా ఆకలి లేకపోవడం, తరుచు వాంతులు చేసుకోవడం వంటి లక్షణాలతో బాధపడుతోంది. దాంతో తల్లిదండ్రులు ఆమెను పిడియాట్రిషన్, ఈఎన్‌టీ తదితర స్పెషలిస్ట్ వైద్యులకు చూపించారు. అయినా, ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న ఆస్టర్స్ పిల్లల, మహిళల ఆసుపత్రికి వెళ్లారు. దీంతో పరీక్షలు చేసిన వైద్యులు బాలిక ట్రైకోబెజోర్ తో ఉన్నట్లు గుర్తించారు. ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు ,ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి, గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన, మృతురాలు బ్యూటిషిన్‌గా గుర్తింపు
బాలిక జీర్ణాశయాంతర పేగుల్లో భారీగా జుట్టు (Cricket Ball-Sized Hairball) పేరుకుపోయిందని వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత ఓపెన్ స్టమక్ ఆపరేషన్ చేసి క్రికెట్ బాల్ సైజులో ఉన్న హెయిర్ బాల్‌ను తొలగించారు. ట్రైకోబెజోర్ అనేది చాలా అరుదైన పరిస్థితి అని.. సదరు బాలిక తరహాలోనే చిన్నపిల్లల్లో కనిపిస్తుందని వైద్యులు తెలిపారు. ట్రైకోఫాగియాతో సంబంధం ఉంటుందని.. ఇది జట్టును తినే మానసిక రుగ్మత అని పేర్కొన్నారు.
హెయిర్ బాల్ పెద్దగా, జిగటగా ఉన్నందున ఎండోస్కోపిక్ చేసేందుకు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నందున లాపరోటమీగా పిలిచే ఓపెన్ స్టమక్ సర్జరీని బాలికకు చేసినట్లు తెలిపారు. మొత్తం రెండున్నర గంటల్లో సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మంజరి సోమశేఖర్ తెలిపారు. బాలికకు సర్జరీ చేయకపోతే తీవ్రమైన పోషకాహార లోపం, రక్తహీనత, కడుపు నుంచి గణనీయమైన రక్తస్రావానికి దారి తీసే అవకాశం ఉండేదన్నారు. ఆపరేషన్ అనంతరం ప్రత్యేకంగా ఆహారంతో పాటు కౌన్సెలింగ్ సైతం ఇస్తున్నట్లు వివరించారు.