Tata 150th Anniversary Scam (Photo-Taitter/tata group)

ఈ మధ్య కాలంలో అనేక స్కాములు లింకులు ద్వారా జరుగుతున్నాయి. వాట్సాప్ ద్వారా యూజర్లకు ఓ లింక్ పంపి దాన్ని క్లిక్ చేయమని అడుగుతారు. కంపెనీ వార్షికోత్సవమనో లేకుంటే ఆఫర్ అనో ఈ లింక్ పంపిస్తుంటారు. తాజాగా గత కొద్ది రోజుల నుంచి టాటా కంపెనీకి సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది. వైరల్ అవుతున్న పోస్టులో టాటా గ్రూప్ 150వ వార్షికోత్సవం (BEWARE of Tata 150th Anniversary Scam) సందర్భంగా టాటా నెక్సాన్ కారును గెలుచుకోవడానికి ఈ పోస్టు క్లిక్ చేయండి (Tata Nexon Bumper Prize) అని ఉంటుంది.

అయితే, ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆన్ లైన్ స్కామ్ లు చాలా సాధారణం అయ్యాయి. అందుకే, ఇటువంటి విషయాల గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఒకవేల మీరు గనుక ఇటువంటి లింక్స్ క్లిక్ చేస్తే మీ ఆర్థిక వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారం హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. హ్యాకర్లు నిరంతరం మీ డబ్బును దోచుకోవడానికి ఇలాంటి స్కామ్ లింక్స్ పంపిస్తారు అనే విషయం గుర్తుంచుకోవాలి.

కేంద్రం మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రికార్డు చేస్తుందనే వార్త అబద్దం, ఆ వాట్సాప్ మెసేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండి, వార్త నిజమా? కాదా? చెక్​ చేసుకొని షేర్​ చేయాలని కోరిన పీఐబీ ఫ్యాక్ట్​చెక్​

ఇప్పుడు వైరల్ అవుతున్న టాటా గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే, అందులో మిమ్మల్ని సరళమైన ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత చివర్లో బహుమతిని తెరవమని అడుగుతారు. మీరు మూడుసార్లు ప్రయత్నించడానికి ఛాన్స్ ఇస్తారు. యూజర్లు సాధారణంగా ఈ ఉచ్చులో పడతారు. ఉచితంగా వస్తున్నాయని బహుమతుల కోసం ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే, మీ వ్యక్తిగత వివరాలను పొందే సామర్ధ్యం ఉన్న వైరస్ లింక్ మీ పరికరంలో హ్యాకర్లు ఇన్ స్టాల్ చేస్తారు.

Here's Tata Group Tweet

అందుకే ఇటువంటి లింక్స్, పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా టాటా లింక్ పై కంపెనీ కూడా అప్రమత్తం చేసింది. ట్విట్టర్లో ఈ లింక్ పై ట్వీట్ చేసింది. ఇది ఫేక్ అని ఎవరూ దీని ఉచ్చులో పడవద్దని కోరంది.



సంబంధిత వార్తలు

How To Spot Ai Generated Images: డీప్ ఫేక్ ఫోటోలను గుర్తించడం చాలా ఈజీ! ఈ ట్రిక్స్ తో ఏఐ జ‌న‌రేటెడ్ ఫోటోలు సుల‌భంగా గుర్తు ప‌ట్టేయండి! (వీడియో ఇదుగో)

Bholaa Shankar Movie: భోళా శంకర్ టికెట్ల ధర పెంపు వార్తలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన, ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం, నమ్మవద్దని సూచన

Fact Check: షిర్డీ ఆలయ పరువు తీసే ఆ పోస్టులు నమ్మవద్దు, హజ్ కమిటీకి రూ. 36 కోట్లు ఇచ్చారనే వార్త అబద్దం, క్లారిటీ ఇచ్చిన షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్

Fact Check: టాటా నెక్సాన్‌ కారు గెలుచుకునే అద్భుత అవకాశం అంటూ లింక్, దాన్ని క్లిక్ చేశారో చిక్కుల్లో పడినట్లే, అలాంటి ఆఫర్ ఏదీ ప్రకటించలేదని తెలిపిన టాటామోటార్స్

Fact Check: వైరల్ అవుతున్న భారత్, చైనా ఘర్షణ వీడియో పాతది, 2020లో గాల్వాన్ వ్యాలీలో ఘర్షణల తర్వాత జరిగిందని స్పష్టం చేసిన ఇండియన్ ఆర్మీ

Fact check: రేషన్ షాపుల్లో బలవంతంగా జెండాల అమ్మకాలు, అసత్య ప్రచారమంటూ స్పష్టం చేసిన కేంద్రం, ప్రజలు స్వచ్ఛందంగా జెండాలను తీసుకోవచ్చంటూ ప్రకటన, హర్‌ ఘర్ తిరంగాపై అసత్య ప్రచారాన్ని ఖండించిన కేంద్రం

Fact Check: ఫాస్టాగ్‌ స్కాన్‌ చేసి డబ్బులు కొట్టేయడం అసాధ్యం, ఆ బుడ్డోడి వీడియో ఫేక్, క్లారిటీ ఇచ్చిన NPCI,పేటీఎం సంస్థలు, ఫాస్టాగ్‌ వ్యక్తికి, వ్యక్తికి మధ్య జరిగే ట్రాన్సాక్షన్‌ కాదని వెల్లడి

Fact Check: ఫిబ్రవరి నెల గురించి వైరల్ పోస్ట్, 823 ఏళ్లకు ఒకసారి రావడం అనేది అబద్దం, ప్రతిసారి ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి, నిజ నిర్థారణ చేసుకోండి