Fact-check Is govt now able to record your messages, calls (Photo-PIB)

సోషల్ మీడియా విషయంలో ఇప్పుడు ఓ సందేశం తెగ వైరల్ అవుతుంది. వాట్సాప్ లో రెండు బ్లూ టిక్ లు, ఒక రెడ్ టిక్ వస్తే మీ మెసేజ్​ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మీ కాల్స్, సందేశాలను రికార్డు చేస్తున్నట్లు అర్ధం చేసుకోవాలని (Is govt now able to record your messages, calls) ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. అలాగే, కేంద్రం మన ఫోన్ కాల్స్, మెసేజ్ లు రికార్డు చేస్తుందని. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్ యూజర్ల డేటాపై నిఘా ఉంచినట్లు మెసేజ్ లు వస్తున్నాయి. ప్రతి కదిలకను దేశం రికార్డు చేస్తుందని ఆ మెసేజ్ లో ఉంది.

కొత్తగా అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై మెసేజ్​ చేయడం చట్ట రీత్యా నేరం. అలా షేర్ చేసిన వారిని ఎలాంటి వారెంట్​ లేకుండానే అరెస్ట్​ చేయవచ్చని ఈ మెసేజ్​లో పేర్కొన్నారు. తాజాగా వైరల్​ అవుతున్న ఈ న్యూస్​పై పీఐబీ ఫ్యాక్ట్​చెక్​ (PIB Fact Check) స్పష్టతనిచ్చింది. ‘‘ఈ వార్తలు పూర్తిగా అబద్దం. అయితే, ఇతరులకు సందేశాలు పంపే క్రమంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. ఆ వార్త నిజమా? కాదా? చెక్​ చేసుకొని షేర్​ చేయాల్సిందిగా కోరుతున్నాం” అని ట్వీట్​ చేసింది. కేంద్రం నుంచి ఇలాంటి ప్రకటన ఏదీ వెలువడలేదని షేర్ చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని కోరింది.

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్ న్యూస్, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేయండి, చేయకుంటే యజమాని వాటా ఇక పొందలేరు

ఇక కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ ఐటీ నిబంధనలకు సంబంధించి వాట్సాప్​, భారత ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తోంది. సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ​ వాట్సాప్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. నూతన డిజిటల్ ఐటీ నిబంధనల​ వల్ల వాట్సాప్​లో పంపే సందేశాలు, సంభాషణలు బయటివారికి తెలిసే అవకాశం ఉందని, తద్వారా తమ యూజర్ల​ ప్రైవసీ దెబ్బతింటుందని వాట్సాప్​ వాదిస్తుంది. అయితే కేంద్రం మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది.

Here's PIB Fact Check

కొత్త డిజిటల్ ఐటీ నిబంధనలతో వినియోగదారుడి సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదని.. దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన యూజర్ల డేటాను అధికారులు అడిగితే తప్పకుండా ఇవ్వాల్సిందేనని పేర్కొంది. అయితే, ఇలా చేస్తే తమ యూజర్ల​ డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, కొత్త ఐటీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వాట్సాప్ డిమాండ్​ చేస్తుంది. దీంతో పాటు ట్విటర్ - కేంద్రం మధ్య కూడా వార్ నడుస్తోంది. ట్విట్టర్ కొత్త ఐటీ చట్టంలో కొన్ని నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతుంది.