New Rule for PF Account Holders: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్ న్యూస్, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేయండి, చేయకుంటే యజమాని వాటా ఇక పొందలేరు, జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్, ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా..
File image of EPFO office | (Photo Credits: PTI)

New Delhi, May 31: ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారులకు అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన నిబంధనలలో తాజాగా కొన్ని మార్పులు (New rule for PF account holders) చేసింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1, 2021 నుంచి అమలులోకి వస్తాయి.

కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాను (PF Account) ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అలా చేయలేని పక్షంలో పీఎఫ్ లో జమ చేసే మొత్తంపై ప్రభావం పడనుంది. కాగా ఉద్యోగుల ఖాతాలను (PF account holders) ఆధార్ లింకు చేసే బాధ్యతను ఈపీఎఫ్ఓ, ​​యజమానులకు అప్పగించింది.

ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ లింకు (link your PF account with Aadhaar) కాకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇకనుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింకు చేసుకోవాలి. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యుఎఎన్) ను ఆధార్‌తో లింకు తప్పనిసరిగా చేసుకోవాలంటూ..దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది.

జియో మరో భారీ ప్రాజెక్ట్, భారత్ నుంచి ప్రపంచమంతా కేబుల్ వ్యవస్థ, ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌, సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం

సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి, పీఎఫ్ ఖాతా ఆధార్‌తో లింకు చేయకపోయినా లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్(యుఎఎన్) ఆధార్‌తో ధృవీకరించబడకపోయినా, ఈసీఆర్(ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్) దాఖలు చేయబడదు. దీని ప్రకారం ఉద్యోగులు తమ సొంత పీఎఫ్ ఖాతాలో సంస్థ యజమాని జమ చేసే వాటాను ఇక నుంచి పొందలేరు. జూన్ 1లోగా తమ ఉద్యోగుల ఖాతాలను ఆధార్‌తో లింక్ చేసి ధృవీకరించాలని ఈపీఎఫ్‌ఓ యజమానులందరినీ ఆదేశించింది.

ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయడం ఎలా ?

అధికారిక ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్( www.epfindia.gov.in) ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.

ఆన్‌లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఈ-కెవైసి పోర్టల్‌కు వెళ్లి యుఎఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయండి

యుఎఎన్ ఖాతాలో నమోదు చేసిన మీ యుఎఎన్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ నంబర్‌ను పొందుతారు. ఓటీపీని, 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి ఫారమ్‌ను సమర్పించండి. ఇప్పడు ఓటీపీ ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి.

మీ ఆధార్ వివరాలను ధృవీకరించడానికి మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్‌లో ఓటీపీ వస్తుంది. ఈ ధృవీకరణ తర్వాత మీ ఆధార్ మీ పీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడుతుంది.

ఈపీఎఫ్ డిపాజిట్ల నుంచి మ‌రో ద‌ఫా నాన్‌-రీఫండ‌బుల్ అడ్వాన్స్ కు అనుమతి

ఇదిలా ఉంటే ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తమ స‌భ్యుల‌కు త‌మ ఈపీఎఫ్ డిపాజిట్ల నుంచి మ‌రో ద‌ఫా నాన్‌-రీఫండ‌బుల్ అడ్వాన్స్ తీసుకునేందుకు అనుమ‌తినిచ్చింది. ఆదివారం జ‌రిగిన ఈపీఎఫ్‌వో గ‌వ‌ర్నింగ్ బాడీ స‌మావేశం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

భారత్‌లో 5జీ సేవలు, 13 కంపెనీల‌ దరఖాస్తులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం, చైనా కంపెనీలను 5జీ ట్ర‌య‌ల్స్‌కు దూరంగా ఉంచిన టెలికాం విభాగం

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌నా (పీఎంజీకేవై) కింద గ‌తేడాది మార్చిలో ఈపీఎఫ్ డిపాజిట్ల నుంచి ప్ర‌త్యేక విత్‌డ్రాయ‌ల్స్‌కు నిబంధ‌న జ‌త చేసింది. ఈ నిబంధ‌న కింద త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్ల మూడు నెల‌ల క‌నీస వేత‌నం ప్ల‌స్ క‌రువు భ‌త్యం/ ఈపీఎఫ్ ఖాతాలో స‌భ్యుడి క్రెడిట్‌లో 75 శాతంల్లో ఏది త‌క్కువైతే దాన్ని విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్‌-19 అడ్వాన్స్ కోసం 76.31 ల‌క్ష‌ల క్లెయిమ్‌ల‌కు పైగా ఆమోదించింది. దీని కింద రూ.18,698.15 కోట్లు పంపిణీ చేసింది. కాగా క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్‌తోపాటు బ్లాక్ ఫంగ‌స్‌ను అంటువ్యాధిగా కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ నేపథ్యంలో త‌మ స‌భ్యులు తొలిద‌ఫా కోవిడ్‌-19 అడ్వాన్స్ మాదిరిగానే రెండో ద‌ఫా అడ్వాన్స్ కోసం దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఫ‌స్ట్ అడ్వాన్స్ టైంలో మాదిరే ఇప్పుడు విత్‌డ్రాయ‌ల్స్ కోసం ప్రాసెస్ చేసుకోవాలి. ఇందుకోసం ఈపీఎఫ్‌వో ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ పేరిట ఒక వ్య‌వ‌స్థ‌ను రూపొందించింది. స‌భ్యులు కేవైసీ స‌మ‌ర్పించిన త‌ర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ ప్ర‌క్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించింది. మామూలుగా ఈ క్లెయిమ్‌ల‌ను ఆమోదించ‌డానికి 20 రోజులు ప‌డుతుంది.