టెలికం రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇప్పటివరకు 4జీతో పరుగులు పెట్టిన ఇండియా త్వరల 5జీతో పరుగులు పెట్టనుంది. దేశంలో ఈ ఏడాది చివరికల్లా 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు 13 కంపెనీల దరఖాస్తులను ప్రభుత్వం (5G Trials Get Approval From Telecom Department) ఆమోదించింది. కాగా 5 జి ట్రయల్స్ కోసం టెలికం విభాగానికి మొత్తం 16 దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే చైనా కంపెనీలైన హువావే, జెడ్‌టీఈలను 5 జీ ట్రయల్‌కు దూరంగా ఉంచారు.
5 జీ ట్రయల్ కోసం ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రంను 1984 లో స్థాపించారు. భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా, రిలయన్స్ జియో సంస్థలు ఎరిక్సన్, నోకియాకు చెందిన విక్రేతలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.
5 జీ ట్రయల్ కోసం టెలికాం కంపెనీలకు త్వరలో 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ఎయిర్ వేవ్స్ ఇవ్వనున్నట్లు టెలికం విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో (Different Locations Across India) పరీక్షలు వంటి షరతులను కంపెనీలు పాటించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. నెట్‌వర్క్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు.
Here's Update
5G trials to cover rural, semi-urban and urban areas
Go-ahead includes trials featuring indigenous 5G technology@DoT_India @rsprasad @SanjayDhotreMP @mygovindia @PIB_India @DDNewslive @airnewsalerts
— PIB_INDIA Ministry of Communications (@pib_comm) May 4, 2021
టెలికాం కంపెనీలకు ఎయిర్‌వేవ్స్‌ను ట్రయల్స్‌కు మాత్రమే ఉపయోగించేలా ఇవ్వనున్నారు. వాణిజ్యపరంగా ఉపయోగించకుండా కఠిన హెచ్చరికలు చేయనున్నారు. కంపెనీలు ఈ షరతులను ఉల్లంఘిస్తే వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని టెలికం విభాగం హెచ్చరిస్తోంది.
ప్రపంచంలో 5 జీ సేవలను మొదట దక్షిణ కొరియా, చైనా, యునైటెడ్ స్టేట్స్ లో ప్రవేశపెట్టారు. 5జీ ట్రయల్స్ ప్రారంభించేందుకు భారత్ సన్నాహాలు చేస్తున్నప్పటికీ.. ఈ రకమైన సేవలు ఇప్పటికే 68 దేశాల్లో ప్రారంభమయ్యాయి. ఇందులో శ్రీలంక, ఒమన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వంటి అనేక చిన్న దేశాలు కూడా ఉండటం విశేషం.మన దేశంలో 4జీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు.
గతేడాది కేంద్ర టెలికాం శాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 2021 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో 5జీ వేలం ఉంటుందని సూచన ప్రాయంగా వెల్లడించారు. దీంతో టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. 2020 చివరి వరకు దేశమంతటా 5జీ సేవలు విస్తరించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారని గుర్తుచేశారు. అదుకే టెలికాం విభాగం 5జీ ప్రక్రియపై వేగం పెంచిందనీ, అందులో భాగంగానే వీలైనంత త్వరగా 5జీ వేలం నిర్వహించేందుకు టెలికాంశాఖ సన్నద్ధమవుతోందని తెలిపారు.
అలాగే, 5జీ ధరపై ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, 5జీ రేడియో తరంగాల 1 మెగాహెడ్జ్ ఎయిర్ వేవ్స్ కనీస ధర రూ.492 కోట్లుగా ఉంటుందని సూచనప్రాయంగా చెప్పారు. ఈ క్రమంలోనే తొలుత కనీసం 20 మెగాహెడ్జ్ బ్లాకులను వేలంలో విక్రయిస్తారని తెలుస్తోంది. ఇక మొత్తం 8,293.95 మెగాహెడ్జ్ 4జీ, 5జీ స్పెక్ట్రంను వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి రూ.5.86 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని సమాచారం.