సోషల్ మీడియాలో చిలుకలకు సంబంధించిన అనేక వీడియోలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. కెనడాలో నివసిస్తున్న తమరా మెర్సర్ అనే అందమైన యువతి.. కివి అనే బ్లూ చిలుకను పెంచుకుంటోంది. ఆ చిలుకకు మెర్సర్ చాలా మాటలు నేర్పించింది. ఈ క్రమంలోనే చిలుక తన యజమాని భుజంపై కూర్చొని ముద్దుముద్దుగా మాట్లాడుతోంది.
నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనగా.. తన యజమాని కూడా యూ సో క్యూట్ అంటుంది. వెంటనే చిలుక ఆమెకు లిప్ కిస్ ఇస్తుంది. ధన్యవాదాలు బేబీ అంటూ ప్రేమగా మరిన్ని ముద్దులు పెడుతుంది. బ్లూ చిలుకకు సంబందించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో pets.hall అనే పేజీ షేర్ చేసింది.
Here's Video
View this post on Instagram
అయితే ఈ వీడియోను కెనడాలో నివసిస్తున్న చిలుక యజమాని తమరా మెర్సర్ TikTokలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 150 మిలియన్ కు పైగా వ్యూస్ 11,554,607 likes పైగా లైక్స్ వచ్చాయి. వీడియో ఇదే..