Newdelhi, June 30: దక్షిణాఫ్రికాను (South Africa) ఓడించి భారత (India Team) జట్టు T20 ప్రపంచ కప్ (T20 World Cup) ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. 2007 తొలిసారి టీమిండియా ధోనీ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 2024లో రెండో సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. భారత్ ఛాంపియన్ గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ , ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి.
టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...
Indian captain Rohit Sharma kiss to hardik Pandya pic.twitter.com/5HGCCzBzhm
— Mujahidur Rahman (@Mujahidur45) June 29, 2024
ఆప్యాయతతో ముద్దు
మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతున్న ఆల్ రౌండర్ హార్దిక్ కు భారత కెప్టెన్ రోహిత్ ఎంతో ఆప్యాయంగా ముద్దు ఇచ్చాడు. అలాగే, మ్యాచ్ లో వీరిద్దరూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.