Wynk Music App: సంగీత ప్రియులకు షాకివ్వబోతున్న ఎయిర్‌టెల్, వింక్ మ్యూజిక్ సేవలకు గుడ్ బై.. ఇకపై యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినే అవకాశం
యాపిల్‌తో కొత్తగా కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న వింక్ మ్యూజిక్ (Wynk) సేవల్ని త్వరలోనే నిలిపి వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాపిల్‌తో కొత్తగా కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
‘‘త్వరలోనే వింక్ మ్యూజిక్‌కు స్వస్తి పలకనున్నాం. దీంతో వింక్ మ్యూజిక్‌లోని ఉద్యోగులను ఎయిర్‌టెల్‌లో సర్దుబాటుచేయనున్నాం. ఇకపై ఎయిర్‌టెల్ యూజర్లు యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినొచ్చు. అయితే ఇప్పటికే వింక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారి కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్ తీసుకురానుంది’’ అని కంపెనీకి చెందిన అధికారి తెలిపారు.