Bihar: ప్రియురాలిని చీకట్లో కలిసేందుకు ఊరి మొత్తానికి కరెంట్ కట్ చేశాడు, గ్రామస్థులకు తెలియడంతో చితకబాది ఇద్దరికీ పెళ్లి చేశారు, బీహార్‌లో ఆసక్తికర ఘటన

చివరకు ఊరివాళ్లకు తెలియడంతో వారి చేత చావు దెబ్బలు తిన్నాడు.

Representational Image (Photo Credits: File Image)

Patna, May 11: ప్రేమలో పడిన ఓ ఎలక్ట్రీషియన్‌ తన ప్రియురాలిని కలవడానికి ఊరంతా కరెంట్ లేకుండా (Bihar Electrician used to cut power supply) చేశాడు. చివరకు ఊరివాళ్లకు తెలియడంతో వారి చేత చావు దెబ్బలు తిన్నాడు. ఈ ఆసక్తికర ఘటన వివరాల్లోకెళ్తే....బీహార్‌లోని పూర్నియ జిల్లాలోని గణేశ్‌పూర్‌ గ్రామంలోని ప్రజలు తరుచు కరెంట్‌ కోతలతో బాధపడుతున్నారు. తమ చుట్టుపక్కల గ్రామాల వాళ్లకి ఇలాంటి సమస్య లేకపోయినా ఆ గ్రామానికి మాత్రమే కరెంట్ లేకపోవడంతో (cut power supply of village in Bihar) ఊరివాళ్లకి ఏదో జరుగుతుందని అనుమానం వచ్చింది.

దీంతో ఆ గ్రామస్తులంతా ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా గ్రామంలోని ప్రజలంతా కలిసి నిఘా పెట్టడం మొదలు పెట్టారు. వారి నిఘాలో ఇదంతా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్‌ అని తెలుసుకుని ప్రజలంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదీ కూడా కేవలం తన గర్ల్‌ఫ్రెండ్‌ని చీకటిలో కలవడానికి (meet girlfriend in dark) మొత్తం గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దీంతో గ్రామస్తులంతా పథకం వేసి మరీ ఆ ప్రేమికులిద్దరిని పట్టుకోవడమే కాకుండా ఆ ఎలక్ట్రీషియన్‌ని చితకొట్టి మరీ గ్రామంలో ఊరేగించారు.

చీకట్లో వధువు చెల్లికి తాళి కట్టేసిన వరుడు, కరెంట్ వచ్చాక చూసి బిత్తరపోయిన వధువు తల్లిదండ్రులు, మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయం

అంతేకాదు ఈ సమస్య మళ్లీ తలెత్తకుండా ఉండేలా ఆ ఊరిలోని గ్రామస్తులు, సర్పంచ్‌, ఇతర గ్రామ కౌన్సిల్‌ సభ్యుల సమక్షంలోనే ఆ ప్రేమికులిద్దరికి వివాహం చేశారు. ఐతే ఆ గ్రామస్తులు ఆ ఎలక్ట్రీషియన్‌ పై ఎలాంటి కేసు పెట్టలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif