Bihar: యువతిపై అత్యాచారయత్నం, బాధితురాలి బట్టలు 6 నెలలు ఉతకాలని బీహార్ కోర్టు సంచలన తీర్పు, గ్రామంలోని మహిళల దుస్తులను కూడా ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేయాలని పనిష్మెంట్
ఆరు నెలల పాటు బాధితురాలి బట్టలు ఉతకాలని (wash women’s clothes for six months) నిందితుడిని కోర్టు ఆదేశించింది.
Patna, Sep 25: అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో ఓ వ్యక్తికి బిహార్‌లోని స్థానిక కోర్టు ఒకటి విచిత్రమైన శిక్ష విధించింది. ఆరు నెలల పాటు బాధితురాలి బట్టలు ఉతకాలని (wash women’s clothes for six months) నిందితుడిని కోర్టు ఆదేశించింది. అలాగే గ్రామంలోని మహిళల దుస్తులను కూడా ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని షాకింగ్ పనిష్మెంట్ ఇచ్చింది. ఈ షరతుకు అంగీకరించడంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ తీర్పు బిహార్ అంతటా చర్చనీయాంశంగా మారింది.
లైంగికదాడికి యత్నం (Bihar Man accused of rape) ఆరోపణలతో 20 ఏళ్ల యువకుడిని పోలీసులు గత ఏప్రిల్‌లో కస్టడీలోకి తీసుకుని కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. తప్పును అంగీకరించిన నిందితుడు.. తన వృత్తిపరమైన సామర్ధ్యంలో సమాజానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నిందితుడు వాషర్‌మెన్ కమ్యూనిటీకి చెందిన వాడు కావడంతో కోర్టు అప్పటికప్పుడు విచిత్రమైన పనిష్మెంట్‌ను విధించింది. బాధితురాలితోపాటు గ్రామంలోని మహిళల దుస్తులను ఉచితంగా ఉతకాలని ఆదేశించింది. ఇందుకు అంగీకరించడంతో సదరు నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల తర్వాత గ్రామ సర్పంచ్ నిందితుడి సేవపై ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందని కూడా తెలిపారు.
ఝంజీర్‌పూర్ ఏడీజేగా ఉన్న అవినాష్ కుమార్.. గతంలో కూడా ఇలాంటి అనేక వింత తీర్పులను ప్రకటించినట్లు స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి. గత ఆగష్టులో లాక్‌డౌన్ సమయంలో పాఠశాలలు తెరవడంపై నమోదైన కేసులో గ్రామంలో పిల్లలకు ఉచితంగా బోధించాలని ఒక ఉపాధ్యాయుడిని ఆదేశించాడు.