HC on Hijab Ban in College: ముంబై కాలేజీలో హిజాబ్ నిషేధం, ఎలాంటి జోక్యం చేసుకోలేమని తెలిపిన బాంబే హైకోర్టు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలోని ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాల యాజమాన్యం తీసుకున్న హిజాబ్‌ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

Hijab Ban (Photo-ANI)

Mumbai, June 26: దేశ ఆర్థిక రాజధాని  ముంబైలోని చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలోని ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాల యాజమాన్యం తీసుకున్న హిజాబ్‌ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్‌ నిషేధిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తొమ్మిది మంది విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఏఎస్‌ చందుర్కర్‌, జస్టిస్‌ రాజేష్‌ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (జూన్‌26) విచారించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై ఉన్న నిషేధం వెంటనే రద్దు చేయండి, కర్ణాటక ప్రభుత్వాన్నికోరిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా

కాలేజీ నిర్ణయం రాజ్యాంగం తమకు ఇచ్చిన ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తోందని విద్యార్థినులు ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే కాలేజీ యాజమాన్యం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ డివిజన్‌ బెంచ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలోని ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాలల్లో విద్యార్థినులు హిజాబ్‌, నఖాబ్‌, బుర్ఖా, క్యాపులు, బ్యాడ్జీలు ధరించడానికి వీల్లేదని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. తాము ఏ మతానికి వ్యతిరేకంగా ఎలాంటి డ్రెస్‌ కోడ్‌ పెట్టలేదని, కేవలం యూనిఫాం వేసుకుని విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాలేజీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి