Cat at JNTUH Kitchen: జేఎన్టీయూహెచ్ కిచెన్ లో ఈసారి పిల్లి.. ఎలుకను వెతుక్కుంటూ వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతల ట్వీట్ (వీడియోతో)
తినే పదార్థాల దగ్గర ఓ పిల్లి తచ్చాడుతున్న వీడియో తాజాగా వైరల్ గా మారింది.
Hyderabad, July 16: జేఎన్టీయూహెచ్ (JNTUH) హైదరాబాద్ (Hyderabad) హాస్టల్లో (Hostel) విద్యార్థులకు పెట్టే ఆహారంలో నాణ్యతా ప్రమాదాలు, శుభ్రత కరువైనట్టు మరోసారి రుజువైంది. తినే పదార్థాల దగ్గర ఓ పిల్లి తచ్చాడుతున్న వీడియో తాజాగా వైరల్ గా మారింది. మొన్నటికి మొన్న చట్నిలో ఎలుక కనిపించిన ఘటన మరిచిపోకముందే.. ఇప్పుడు పిల్లి కన్పించడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
జమ్మూకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. అధికారి సహా అమరులైన నలుగురు సైనికులు
ఎలుకను వెతుక్కుంటూ వచ్చిన పిల్లి
జేఎన్టీయూలో విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహారంలో పడిన ఎలుక, ఆహారాన్ని తింటున్న పిల్లికి సంబంధించి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ షేర్ చేశారు. ఆహారంలో పడిన ఎలుకను వెతుక్కుంటూ వచ్చిన పిల్లి అని క్రిశాంక్ ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ జేఎన్టీయూ పిల్లులు, ఎలుకలకు నిలయంగా మారిందని ఎద్దేవా చేశారు.
తొలి ఏకాదశి ఎప్పుడు..? ఉపవాసం, పూజ విధానం ఏమిటి...ఈ రోజు చేయాల్సిన పూజలు ఇవే..