Corona Cases: కరోనా డేంజర్ బెల్స్.. దేశంలో ఒక్క రోజే 614 కేసులు.. ముగ్గురి మృతి.. జేఎన్.1 రకం 21 కేసులు నమోదు
గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
Newdelhi, Dec 21: కరోనా (Corona) మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,311కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం పేర్కొంది. కొవిడ్-19 ఉప రకం జేఎన్.1కు (JN.1) సంబంధించి మూడు రాష్ర్టాల్లో 21 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళలో (Kerala) మూడు మరణాలు నమోదయ్యాయి.
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా పూర్తిగా నాశనం కాలేదని, ఇటీవల కాలంలో కొత్త వేరియంట్ వెలుగుచూస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.