Vande Bharat: ఇదేందయ్యా.. ఇది? చపాతీ ఆర్డరిస్తే.. బొద్దింక వచ్చింది.. ‘వందేభారత్‌’లో షాకింగ్ ఘటన.. వెంటనే స్పందించిన రైల్వే.. బాధితుడికి క్షమాపణలు.. కాంట్రాక్టర్‌ కు 25 వేల ఫైన్

రైల్లో తాను ఆర్డర్ ఇచ్చిన చపాతీల్లో బొద్దింక కనబడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు దాన్ని ఫోటోగా తీసి సోషల్ మీడియాలో ఐఆర్‌ సీటీసీకి ఫిర్యాదు చేశాడు.

Credits: Twitter

Newdelhi, July 28: వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో (Train) తాను ఆర్డర్ (Order) ఇచ్చిన చపాతీల్లో బొద్దింక (Cockroach) కనబడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు దాన్ని ఫోటోగా తీసి సోషల్ మీడియాలో ఐఆర్‌ సీటీసీకి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జులై 24న భోపాల్ నుంచి గ్వాలియర్ వెళుతున్న వందేభారత్‌ రైల్లో సుబోధ్ పహలాజన్ ప్రయాణిస్తున్నాడు. ఆకలి వేయడంతో చపాతీలు ఆర్డర్ ఇచ్చాడు. అయితే, తనకిచ్చిన ఆహారం పార్శిల్‌ లోని చపాతీపై చిన్న బొద్దింకను సుబోధ్ గుర్తించాడు. వెంటనే దాన్ని ఫొటో తీసి నెట్టింట్లో షేర్ చేస్తూ ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశారు. ‘‘వందేభారత్ రైల్లో నాకు ఇచ్చిన ఫుడ్‌లో బొద్దింక కనిపించింది’’ అని ట్వీట్ చేశారు.

Manipur Sexual Violence Case: సీబీఐ చేతికి మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు కేసు, కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయం

స్పందించిన రైల్వే

సుబోధ్ ఫిర్యాదుపై రైల్వేశాఖ వెంటనే స్పందించింది. ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పిన రైల్వే శాఖ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సుబోధ్ కి ఐఆర్‌సీ టీసీ ఆ తరువాత మరో పార్శిల్‌ ను ఏర్పాటు చేసింది. ఆహార సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ కు ఐఆర్‌సీ టీసీ రూ. 25 వేలు జరిమానా విధించింది.

Pune Horror: అప్పు చెల్లించలేదని భర్త ఎదుటే భార్యపై అత్యాచారం, మొబైల్‌లో చిత్రీకరించి అడిగినప్పుడల్లా రావాలని బెదిరింపులు, పుణేలో షాకింగ్ ఘటన