COVID-19 Shot: 60 ఏళ్ళ వయసులో 90 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న ఘనుడు, డబ్బు సంపాదన కోసం వక్రమార్గం ఎంచుకున్న జర్మనీ వృద్ధుడు

60 ఏళ్ల వయసులో అతను ఏకంగా 90 సార్లు వ్యాక్సిన్ (Man in Germany gets 90 Covid-19 shots ) వేయించుకున్నాడు.

Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

కూటి కోసం కోటి విద్యలు’ అన్నట్టు జర్మనీలో 60 ఏళ్ల వృద్ధుడు మనీ సంపాదన కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. 60 ఏళ్ల వయసులో అతను ఏకంగా 90 సార్లు వ్యాక్సిన్ (Man in Germany gets 90 Covid-19 shots ) వేయించుకున్నాడు. తూర్పు జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు నకిలీ టీకా కార్డులను విక్రయించడానికి (sell forged passes) 90 డోసుల కొవిడ్ టీకాలు వేయించుకోవడం కలకలం రేపుతోంది. తూర్పు రాష్ట్రమైన సాక్సోనీలోని టీకా కేంద్రాల్లో జర్మన్ వృద్ధుడు 90 డోసుల వ్యాక్సిన్ (Coronavirus Vaccination) వేయించుకున్నట్లు తేలడంతో జర్మనీ పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు పెట్టారు.

వ్యాక్సినేషన్ కార్డుల జారీ కోసం వ్యాక్సిన్ వేయించుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివిధ బ్రాండ్లకు చెందిన 90 కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తి ఆరోగ్యంపై టీకాల ప్రభావం ఎలా ఉందనేది తెలియలేదు. జర్మనీ దేశంలో కొవిడ్ టీకాలు వేయించుకునేందుకు నిరాకరించే వారు ఉన్నారు. బయట తిరిగే వ్యక్తులు అందరూ టీకా తీసుకోవడం తప్పనిసరి. దీంతో వేరే వ్యక్తులు టీకాలు వేయించుకొని వారి పేర్లతో వేరే వాళ్లు వేయించుకొని సర్టిఫికెట్ ను వారికి అందజేస్తున్నారు.

కొత్త వైరస్ ఎక్స్‌ఈ నిజంగానే ఇండియాకు వచ్చిందా, ఇంకా అధికారికంగా ధృవీకరించని కేంద్ర ఆరోగ్యశాఖ, NIB రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం

తాజాగా శాక్సోనీ రాష్ట్రంలోని ఎలెన్ బర్గ్ కేంద్రానికి ఇటీవలే అతడు వరుసగా రెండో రోజు వచ్చి టీకా ఇవ్వాలని కోరాడు. దీంతో అక్కడి సిబ్బంది అతడ్ని గుర్తించి విషయం ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక కంపెనీ అని కాకుండా ఏది అందుబాటులో ఉంటే ఆ కంపెనీ వ్యాక్సిన్ అతడు తీసుకున్నట్టు తెలుసుకున్నారు. ఇలా 90 షాట్స్ తీసుకున్నట్టు గుర్తించారు. అతడి ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాల సమాచారం ఇంకా తెలియలేదు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.