Fitness Challenge: వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ.. బరువు తగ్గితే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించిన ‘జెరోధా’

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన ఓ సంస్థ వారికి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా తెలిపింది.

Nithin Kamath (File)

NewDelhi, September 26: ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల (Work From Home Employees) ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన ఓ సంస్థ వారికి బ్రహ్మాండమైన ఆఫర్ (Offer) ప్రకటించింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు బరువు పెరిగి అనారోగ్యం బారినపడుతున్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరకూడదని భావించిన ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా (Zerodha) ఉద్యోగుల కళ్లలో సంతోషం నింపే ప్రకటన చేసింది. బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది.

దివ్యాంగురాలైన కుమార్తెకు అన్నం తినిపించే రోబోను తయారుచేసిన కూలీ.. వాయిస్ కమాండ్‌తో పనిచేస్తున్న రోబో!

ఈ మేరకు ఆ సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలిపారు. రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకున్న ఉద్యోగులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ ఫిట్‌నెస్ ట్రాకర్ పరికరాల్లో ఉద్యోగులు రోజువారీగా ఎంత కొవ్వును కరిగించాల్సి ఉంటుందన్న పరిధిని ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాన్ని చేరుకున్న వారికి నెల రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తామన్నారు. అలా బరువు తగ్గిన ఉద్యోగుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి రూ.10 లక్షల బహుమతిని అందిస్తామని వివరించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

KTR Slams CM Revanth Reddy: కొడంగల్‌లో నువు మళ్లీ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్‌, రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా అని నిలదీత

Where is Mohammed Shami ? మొహమ్మద్ షమీని ఏం చేశారు, ఆందోళనకర ప్రశ్నలు లేవనెత్తిన టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, మద్దతుగా నిలిచిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

Shiv Nadar India's Most Generous Philanthropist: దాతృత్వంలో నెంబ‌ర్ 1 గా నిలిచిన శివ నాడార్, ప్ర‌తి రోజు రూ.5.9 కోట్లు విరాళం ఇచ్చి మొద‌టిస్థానం

Harishrao On CM Revanth Reddy: రేవంత్..నీది నోరా మోరా?, మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు అని చెప్పలేదా?,దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ బాధితుల దగ్గరికి వెళ్దామని ఛాలెంజ్‌

Advertisement
Advertisement
Share Now
Advertisement